ఛాన్స్ కోసం క్యాట్ ఎదురు చూపులు!
అందులో కత్రినాకైఫ్ కూడా ఉంది. అవును ఈ బ్యూటీకి కూడా బాగానే హాలీవుడ్ అవకాశాలు వచ్చాయట.
హాలీవుడ్ ఛాన్సొస్తే ఎవరైనా వదులుకుంటారా? ఎగిరి గంతేసి మరీ అమెరికా వెళ్తున్నా..హాలీవుడ్ సినిమా చేస్తున్నా? అంటూ బోలెడంత ప్రచారం చేసుకుంటారు. దీపికా పదుకొణే..ఐశ్వర్యారాయ్ లాంటి హాలీవుడ్ ని టచ్ చేసి బాలీవుడ్ లో స్థిరపడ్డారు. ప్రియాంక చోప్రా అయితే ఏకంగా హాలీవుడ్ లోనే స్థిరపడింది. తొలి సినిమా అనంతరం వచ్చిన రెస్పాన్స్ బట్టి హాలీవుడ్ లో కొనసాగడమా? లేదా? అన్నది తేలుతుంది. అక్కడ లైఫ్ బాలీవుడ్ కంటే మరింత వైభవంగా ఉంటుంది కాబట్టి! అలాంటి ఛాన్స్ రావడమే ఓ అదృష్టం.
అందులో కత్రినాకైఫ్ కూడా ఉంది. అవును ఈ బ్యూటీకి కూడా బాగానే హాలీవుడ్ అవకాశాలు వచ్చాయట. కానీ అనివార్య కారణాలతో వాటిని రిజెక్ట్ చేసినట్లు తాజాగా రివీల్ చేసింది. ఎందుకలా చేసింది అన్న దానికి కారణాలు రివీల్ చేయలేదు గానీ అప్పుడు రిజెక్ట్ చేసి ఇప్పుడు ఫీలవుతున్నట్లు మాత్రం అమ్మడి మాటల్లో అర్ధమవుతుంది. ఇప్పుడు మంచి హాలీవుడ్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నట్లు ఓపెన్ అయింది. `నా జీవితం అనే పుస్తకంలో కొత్త పేజీ రూపుదిద్దుకుంటుందని భావిస్తున్నా.
అది హాలీవుడ్ అవకాశం అవ్వాలి. హిందీలో బూమ్..తెలుగులో మల్లీశ్వరితో పరిచయమయ్యాను. అక్కడ నుంచే కెమెరా అనుభవం పొందడం మొదలైంది. తర్వాత నెమ్మదిగా దర్శక నిర్మాతలతో చర్చలు జరపడం అలవాటైంది. అనుకున్నవన్నీ సాధించాను. ఎప్పటికీ నా మనసులో సినిమా కే మొదటి స్థానం` అని చెప్పుకొచ్చింది. మరి అమ్మడు కోరుకుంటున్నట్లు హాలీవుడ్ అవకాశం వస్తుందా? రాదా? అన్నది చూడాలి.
ఇంటివరకూ వచ్చిన అవకాశాన్ని ఒకసారి వద్దనుకున్నాక మళ్లీ అదే అవకాశం కోసం ఎదురుచూస్తున్నప్పుడు రావడం అన్నది అంత వీజీ కాదు. హాలీవుడ్ అవకాశం సహనాన్ని పరీక్షిస్తుంది. అవకాశం కోసం ఎంతో ఓపికగా ఎదురుచూడాల్సిందే. అప్పటివరకూ చేసే ప్రయత్నాలు మాత్రం ఆపడకూడదు. మరి క్యాట్ ఏ విధమైన ప్రణాళికతో హాలీవుడ్ ప్రయత్నాలు చేస్తుందో చూడాలి.