కత్రినా కైఫ్ ప్రసవం లండన్ లోనా?
బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ తల్లి కాబోతుందంటూ ఇప్పటికే నెట్టింట ప్రచారం సాగిన సంగతి తెలిసిందే.
బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ తల్లి కాబోతుందంటూ ఇప్పటికే నెట్టింట ప్రచారం సాగిన సంగతి తెలిసిందే. క్యాట్ బేబి బంప్ ని ఎక్కడా రివీల్ చేయకుండా దాచేస్తున్నారని మీడియా కథనాలు వెడెక్కించాయి. పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీ ఇంట ప్రీవెడ్డింగ్ కు క్యాట్ భర్తతో కలిసి హాజరైన సంగతి తెలిసిందే. ఈ వేడుకల్లో కత్రినా ప్రతిసారి తన ఉదరాన్ని దుపట్టాతో పదే పదే దాచుకుంటూ కనిపించారు. వీటికి సంబంధించిన వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో అప్పట్లో వైరల్ అయ్యాయి.
కత్రినా గర్భంతో ఉందని, తన బేబీ బంప్ ను కనిపించకుండా ఉండేందుకే ఇలా చేసిందంటూ కొందరు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. కానీ ఇంతవరకూ ఆ జోడీ ఈ విషయంపై ఎక్కడా ఓపెన్ అయింది లేదు. మీడియాలో ఎన్ని రకాల కథనాలొచ్చినా వాటిపై స్పందించలేదు. తాజాగా లండన్ వీధుల్లో ఈ జోడీ మరోసారి కెమెరా కంట చిక్కింది. నెలలు నిండటంతో కత్రినా ప్రసవాన్ని లండన్ లో ప్లాన్ చేసుకున్నట్లు బాలీవుడ్ మీడియాలో మళ్లీ కథనాలు ఊపందు కున్నాయి.
అందుకు కొన్ని రకాల ప్రూప్ లు సైతం బయట పెట్టింది. భార్య చేయి పట్టుకుని విక్కీ కౌశల్ నెమ్మదిగి నడిపించుకుంటూ తీసుకెళ్తోన్న ఓవీడియో వైరల్ వుతుంది. ఇందులో కత్రినా పొట్టభాగం బాగా ఎత్తుగా ఉన్నట్లు గమనించొచ్చు. కొంత కాలంగా క్యాట్ ఎలాంటి సినిమా షూటింగ్ ల్లో కూడా పాల్గొనలేదు. కొత్త సినిమాలకు కూడా సైన్ చేయలేదు. ఆమె గర్భం దాల్చడంతో కెమారాకి దూరంగా ఉంటున్నట్లు వార్తలొస్తున్నాయి.
లండన్ వీడియో తో మరోసారి ఈ కథనాలకు మరింత బలం చేకూరింది. మరి ఈ కథనాలపై ఆ జంట స్పందిస్తే తప్ప క్లారిటీ రాదు. విక్కీ కౌశల్ మాత్రం సినిమాలతో బిజీగా ఉన్నారు. `బ్యాడ్ న్యూస్` ..`చావా` చిత్రాల్లో నటిస్తున్నాడు. బ్యాడ్ న్యూస్ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. చావా షూటింగ్ దశలో ఉంది.