కీర్తి సురేష్.. ఈసారి మరింత రొమాన్స్
ముఖ్యంగా, సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా ఇతర పరిశ్రమల్లోనూ తన పరిధిని విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.;
తెలుగు సినీ ప్రియులకు జెట్ స్పీడ్ లో దగ్గరైన స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్, గత కొంతకాలంగా తన కెరీర్‌ను భిన్నమైన ట్రాక్ లో హైలెట్ చేసుకుంటోంది. సౌత్‌లో పలు సక్సెస్‌ఫుల్ ప్రాజెక్టులు చేసిన తర్వాత, ఆమె బాలీవుడ్ వైపు అడుగులు వేస్తోంది. ‘మహానటి’ వంటి క్లాసిక్ హిట్ తర్వాత కీర్తి కెరీర్‌కు భారీ మార్పు వచ్చింది. ముఖ్యంగా, సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా ఇతర పరిశ్రమల్లోనూ తన పరిధిని విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం కీర్తి హిందీలో క్రేజీ ప్రాజెక్టులలో నటిస్తోంది. అందులో గత ఏడాది వచ్చిన ‘బేబీ జాన్’ అంతగా హిట్ కాలేదు, ఈ సినిమా అట్లీ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ నష్టాలను మిగిల్చింది. మరోవైపు ‘అక్క’ అనే సినిమాలో నటిస్తోంది. ఇందులో రాధికా ఆప్టే, తను ఆజ్మి, దీప్తి సాల్విలతో కలిసి ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రం సౌత్ ఇండియన్ బ్యాక్‌డ్రాప్‌లో ఉన్న మహిళా గ్యాంగ్‌స్టర్స్ కథగా హైలెట్ అవుతోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి వచ్చిన టీజర్ కీర్తి పాత్రకు మంచి హైప్ క్రియేట్ చేసింది.
ఇదిలా ఉంటే, కీర్తి ఇప్పుడు బాలీవుడ్‌లో కొత్త కోణాన్ని ఎక్స్‌ప్లోర్ చేయడానికి సిద్ధమవుతోంది. రీసెంట్‌గా ఆమె ఒక రొమాంటిక్ కామెడీ సినిమాలో నటించేందుకు చర్చలు జరుపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. గతంలో ఆమె ‘నేను శైలజ’, ‘నేను లోకల్’, ‘రంగ్‌దే’ వంటి సినిమాల్లో లవబుల్ పాత్రలు పోషించి, ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా అలాంటి ఫన్ అండ్ లైట్‌హార్టెడ్ పాత్రను చేయబోతోందని తెలుస్తోంది. సినిమా కథ, ఇతర నటీనటుల వివరాలు ఇంకా రివీల్ చేయలేదు కానీ, ఇది ఆమెకు హిందీ మార్కెట్‌లో మంచి అవకాశంగా మారవచ్చనే అంచనాలు ఉన్నాయి.
గతంలో కంటే ఈసారి రొమాంటిక్ డోస్ కాస్త ఎక్కువగానే ఉంటుందట. కీర్తి కెరీర్‌లో లేటెస్ట్ మార్పులు చూస్తుంటే, ఆమె తెలుగులోనే కాకుండా తమిళం, హిందీలోనూ తన స్థాయిని పెంచుకోవడానికి కృషి చేస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో మరోకొన్ని సౌత్ సినిమాలు కూడా ఉన్నాయి. సౌత్‌లో మంచి కమర్షియల్ సినిమాలే కాకుండా, కంటెంట్ బేస్డ్ ఫిల్మ్స్‌పై కూడా ఫోకస్ పెట్టింది. బాలీవుడ్‌లో తనకు సరైన స్థానం సంపాదించుకోవాలంటే, వరుసగా మంచి కథల్ని ఎంచుకోవడం ఎంతో ముఖ్యం.
ఈ కొత్త ప్రయోగం కీర్తి సురేష్‌కి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. ఇప్పటికే బాలీవుడ్‌లో హిట్ హీరోయిన్ల మధ్య హెల్తీ కాంపిటేషన్ ఉంది. కానీ కీర్తి తన మల్టీ టాలెంటెడ్ పెర్ఫార్మెన్స్‌తో అక్కడ సక్సెస్ అవుతుందా అనే ప్రశ్నకు సమాధానం రాబోయే రోజుల్లో తెలుస్తుంది. మొత్తానికి, రొమాంటిక్ కామెడీతో బాలీవుడ్ ప్రేక్షకులకు కొత్త కీర్తిని పరిచయం చేసే ప్రయత్నం ఆమె చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.