బాలయ్య తర్వాత అతడికి సెంటిమెంటే!
ఇటీవలే చిరంజీవి 157వ సినిమా స్క్రిప్ట్ ను అప్పన్న స్వామి పాదల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేయించిన సంగతి తెలిసిందే.;
నటసింహ బాలకృష్ణకు వైజాగ్ సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామి అంటే ఎంత సెంటిమెంట్ అన్నది చెప్పాల్సిన పనిలేదు. ఆయన నటించిన ఏ సినిమా రిలీజ్ ముందు అయినా తప్పక అప్పన్న స్వామిని దర్శించుకుంటారు. ఆ సినిమా యూనిట్ తో పాటు బాలయ్య ఇలా దర్శనం చేసుకోవడం అన్నది ఎంతో కాలంగా ఆయనకు అనవాయితీగా వస్తోంది. దీన్ని బాలయ్య ఓ సెంటిమెంట్ గా భావిస్తారు.
సినిమా రిలీజ్ అనంతరం మంచి విజయం సాధిస్తుందన్నది ఆయన ప్రగాఢ నమ్మకం. అలాగే ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది వైజాగ్ జిల్లా, చుట్టు పక్కల గ్రామాలతో ఉన్న వాళ్లు ఎంతో మంది అప్పన్న స్వామిని దర్శించుకుంటారు. తీరని కోరికలు సైతం అప్పన్న స్వామి తీరుస్తాడని అంతా బలంగా నమ్ముతుంటారు. తాజాగా డైరెక్టర్ అనీల్ రావిపూడి కూడా ఆ జాబితాలో చేరిపోయారు.
ఇటీవలే చిరంజీవి 157వ సినిమా స్క్రిప్ట్ ను అప్పన్న స్వామి పాదల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేయించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ అనీల్ ఏ సినిమా స్క్రిప్ట్ కి ఇలా పూజలు చేయలేదు. అంతకు ముందు బాలయ్యతో `భగవంత్ కేసరి` రిలీజ్ అయిన సమయంలో అనీల్ ఇదే ఆలయానికి వచ్చే ప్రత్యేక పూజలు చేసారు. ఆ తర్వాత చేసిన `సంక్రాంతికి వస్తున్నాం` బ్లాక్ బస్టర్ అయింది.
ఈ నేపథ్యంలో తాజాగా చిరంజీవి 157వ సినిమా విషయంలో ముందొస్తుగానే అప్పన్న స్వామికి అర్జీ పెట్టుకున్నారు. దీంతో అప్పన్న స్వామి అంటే అనీల్ కి కూడా ఓసెంటిమెంట్ లా మారిపోయింది. వైజాగ్ తో అనీల్ బంధం వీడదీయలేనిది. ఆయన్ని గొప్ప డైరెక్టర్ చేసింది వైజాగ్. అనీల్ ఏ సినిమా కథ రాయాలన్నా పార్క్ హోటల్ లోనూ కూర్చునే రాస్తాడు. తొలి సినిమా నుంచి ఇదే విధానంలో ఉన్నాడు. ఇప్పటికీ అలాగే కొనసాగుతున్నాడు. చిరంజీవి సినిమా కథ కూడా అక్కడే కూర్చుని రాసాడు.