సుక్కూ బాలీవుడ్ మూవీపై క్లారిటీ!

అందులో భాగంగానే గ‌త రెండు మూడు రోజులుగా నెట్టింట ఓ వార్త సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొడుతుంది.;

Update: 2025-03-19 09:24 GMT

సోష‌ల్ మీడియా బాగా పెర‌గ‌డంతో ఎవ‌రికి ఇష్ట‌మొచ్చిన వార్త‌ల్ని వారు చాలా సుల‌భంగా సృష్టిస్తున్నారు. నిజాలు, ఆధారాలతో ప‌ని లేకుండా కొత్త వార్త‌ల్ని క్రియేట్ చేస్తున్నారు. అందులోనూ ఫిల్మ్ ఇండ‌స్ట్రీకి సంబంధించిన వార్త‌లు మ‌రీ ఎక్కువ‌గా వ‌స్తాయి. ఫలానా హీరో సినిమాలో ఫ‌లానా హీరోయిన్ న‌టిస్తుంద‌ని, ఫ‌లానా డైరెక్ట‌ర్- హీరో కాంబినేష‌న్ లో సినిమా రానుంద‌ని ప్ర‌చారం చేస్తూ అటెన్ష‌న్ మూట గ‌ట్టుకుంటూ ఉంటారు.

అందులో భాగంగానే గ‌త రెండు మూడు రోజులుగా నెట్టింట ఓ వార్త సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొడుతుంది. పుష్ప‌2 సినిమాతో వ‌ర‌ల్డ్ వైడ్ ఫేమ‌స్ అయిన సుకుమార్ రీసెంట్ గా బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కు ఓ క‌థ చెప్పాడ‌ని, ఆ క‌థ‌కు షారుఖ్ కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని, త్వ‌ర‌లోనే వీరిద్దరి క‌ల‌యిక‌లో సినిమా ఉంటుంద‌ని వార్త‌లు జోరుగా వినిపించాయి.

అక్క‌డితో అయిపోలేదు. ఆ సినిమా జాన‌ర్, క‌థని కూడా ఆల్మోస్ట్ తేల్చేసింది సోష‌ల్ మీడియా. దీంతో హిందీ మీడియా వ‌ర్గాల్లో ఈ వార్త బాగా ప్ర‌చారమైంది. రీసెంట్ గా పుష్ప‌2 తో భారీ హిట్ అందుకున్న సుకుమార్ త‌ర్వాతి సినిమాను రామ్ చ‌ర‌ణ్ తో చేయాల్సి ఉంది. చ‌ర‌ణ్ మూవీ త‌ర్వాత పుష్ప‌3 చేసే ఛాన్సుంది. ఈ రెండింటి మ‌ధ్య‌లో షారుఖ్ సినిమా ఉండొచ్చ‌ని కూడా అన్నారు.

అయితే సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ఈ వార్త‌ల్లో ఎలాంటి నిజం లేద‌ని సుకుమార్ స‌న్నిహితులు చెప్తున్నారు. అస‌లు సుకుమార్, షారుఖ్ మ‌ధ్య ఎలాంటి మీటింగ్ జ‌ర‌గ‌లేద‌ని, ఈ మ‌ధ్య కాలంలో సుక్కూ ముంబైకే వెళ్ల‌లేద‌ని వారంటున్నారు. పుష్ప2 సెట్స్ పై ఉన్న‌ప్పుడు సుక్కూకి బాలీవుడ్ స‌హా ప‌లు ఇండ‌స్ట్రీల నుంచి ఆఫ‌ర్లు వ‌చ్చిన మాట నిజ‌మే కానీ ఆయ‌న మాత్రం ఎప్పుడూ టాలీవుడ్ ను వ‌ద‌లాల‌ని డిసైడ్ అవ‌లేద‌ని అంటున్నారు. తెలుగులో ఉండి ఇక్క‌డి నుంచే సినిమా తీసి దానికి దేశ వ్యాప్తంగా క్రేజ్ తీసుకుని రావాల‌నేది మాత్ర‌మే సుక్కూ ఆలోచ‌న అని, వేరే భాష‌కు వెళ్లి ఆయ‌న సినిమాలు చేయ‌ర‌ని సుకుమార్ స‌న్నిహితుంటున్నారు. దీంతో సుక్కూ బాలీవుడ్ మూవీ గురించి వ‌చ్చిన వార్త‌ల‌న్నీ పుకార్లేన‌ని తేలిపోయాయి.

Tags:    

Similar News