ఆయన బ్యాచిలర్ జీవితానికి కారణం ఆవిడా?
ఆ లవ్ గనుక కనెక్ట్ అయితే ఆ జీవితం అద్భుతంగా ఉంటుందని అంటుంటారు.;
సల్మాన్ ఖాన్ లవ్ స్టోరీలు...ఎఫైర్ల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆయన జీవితంలో లెక్కలేనన్ని లవ్ స్టోరీలు..ఎఫైర్లు ఉన్నాయని నిత్యం బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తూనే ఉంటాయి. అయితే ఇలా ఎన్ని ప్రేమ కథలు ఉన్నా? స్వచ్ఛమైన ప్రేమ కథ ఒకటుంటుందంటారు. అది జీవితాంతం గుర్తుండే లవ్ స్టోరీ. ఆ లవ్ గనుక కనెక్ట్ అయితే ఆ జీవితం అద్భుతంగా ఉంటుందని అంటుంటారు.
మరి సల్మాన్ ఖాన్ జీవితంలో అలాంటి లవ్ స్టోరీ ఒకటుందా? ఆయన కూడా జెన్యూన్ లవ్ లో ఫెయిలైన వారేనా? అంటే అవుననే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. సల్మాన్ ప్రేమ స్టోరీల జాబితా తీస్తే పెద్ద లిస్టే వస్తుంది. కానీ అందులో సల్మాన్ ఖాన్ కోరి పెళ్లి చేసుకోవాలనుకున్నది మాత్రం జుహీ చావ్లా ని అట. జుహీని సల్మాన్ ఖాన్ ఎంతగా ఇష్టపడ్డాడు అంటే? ఇంటికెళ్లి జుహీ తండ్రిని ఒప్పించేంతగానని తెలుస్తోంది.
తనని పెళ్లి చేసుకోవాలి అనుకున్న విషయాన్ని జుహీ చావ్లా కి చెప్పకుండా నేరుగా వాళ్ల నాన్నకే చెప్పారుట. కానీ ఆయన మాత్రం సల్మాన్ ఖాన్ ని రిజెక్ట్ చేసాడుట. దీంతో తండ్రికి ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక అక్కడితే జుహీ చావ్లా తో ప్రేమను వదిలేసాడుట. ఆ తర్వాత జుహీకి సల్మాన్ ఖాన్ తో ఓ సినిమాలో నటించే అవకాశం వచ్చినా? నో చెప్పిందిట.
జుహీ తండ్రి నటించడానికి వీల్లేదు అనే కండీషన్ పెట్టడంతోనే జుహీ నో చెప్పిందిట. అలా సల్మాన్ ఖాన్ బ్యాచిలర్ గా మిగిలిపోవాల్సి వచ్చింది. ఈ లవ్ స్టోరీకి ముందే జుహీ-సల్మాన్ కలిసి సినిమాల్లో నటించారు. జుహీ చావ్లా 1995 లో బిజినెస్ మెన్ జయ్ మెహతాని పెళ్లి చేసుకుంది. వివాహం తర్వాత చాలా కాలం సినిమాల్లో కొనసాగింది.