టాక్సిక్ పై కాల్ పాల్ సెల్ఫీ వీడియో.. ఏమంటున్నారంటే
కెజిఎఫ్ తో వచ్చిన క్రేజ్ ను కాపాడుకోవడానికి యష్ తన తర్వాతి సినిమాల విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు.;
కెజిఎఫ్ సినిమాతో పాన్ ఇండియన్ లెవల్ లో ఎంతో క్రేజ్ అందుకున్నాడు కన్నడ రాక్ స్టార్ యష్. అప్పటివరకు కన్నడ సినిమాకు మాత్రమే పరిచయమున్న యష్, ఆ సినిమాతో దేశం మొత్తానికి తెలిశాడు. కెజిఎఫ్ ఫ్రాంచైజ్ సినిమాలు యష్ జీవితాన్ని మొత్తానికే మార్చేశాయి. కెజిఎఫ్ తో వచ్చిన క్రేజ్ ను కాపాడుకోవడానికి యష్ తన తర్వాతి సినిమాల విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు.
అందుకే కెజిఎఫ్ తర్వాతి సినిమాను అనౌన్స్ చేయడానికి యష్ చాలానే టైమ్ తీసుకున్నాడు. ఎంతో ఆలోచించి, ఎన్నో కథలు విన్న తర్వాత ఆఖరికి గీతూ మోహన్ దాస్ చెప్పిన కథకు యష్ ఓకే చెప్పి ఆ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాడు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా సమాంతరంగా ఇంగ్లీష్ లో కూడా షూటింగ్ జరుపుకుంటుంది.
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో ఇండియన్ నటీనటులతో పాటూ హాలీవుడ్ స్టార్లు కూడా నటిస్తున్నారు. సినిమాకు హాలీవుడ్ రేంజ్ లో క్రేజ్ తీసుకునిరావడానికే డైరెక్టర్ గీతూ టాక్సిక్ కోసం హాలీవుడ్ కు సంబంధించిన వారిని కూడా రంగంలోకి దింపి సినిమాపై ఒక్కసారిగా బజ్ పెంచింది. ఇదిలా ఉంటే టాక్సిక్ లో అమెరికా నటుడు కాల్ పాల్ ఓ కీలక పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే.
అయితే తాజాగా ఆయన టాక్సిక్ మూవీ గురించి మాట్లాడుతూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. తానో ఇండియన్ సినిమా చేస్తున్నానని అదే టాక్సిక్ అని, ఆ సినిమా కోసం తాను ఇండియన్ భాషల్లో ఒకటైన కన్నడ కూడా నేర్చుకుంటున్నానని చెప్పారు పాల్. అంతేకాదు టాక్సిక్ కు పనిచేయడం తనకు బెస్ట్ ఎక్స్‌పీరియెన్స్ ను ఇచ్చిందని ఆయన అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
కేవీఎన్ ప్రొడక్షన్ పై వెంకట్ కె నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో యష్ నిర్మాణ సంస్థ కూడా భాగమైంది. 1970 నేపథ్యంలో గోవా, కర్ణాటక బ్యాక్ డ్రాప్ లో జరిగే కథతో టాక్సిక్ రూపొందుతున్నట్టు సమాచారం. ఈ సినిమాలో యష్ కు సోదరిగా నయనతార నటిస్తుండగా, హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తోంది.