వ‌ర్కింగ్ ఉమెన్ ఎప్పుడూ ఊరికే డ‌బ్బు తీసుకోరు..

ఒడిశా నుంచి విశాఖ‌ప‌ట్ట‌ణం వెళ్తుండ‌గా దారిలో క‌నిపించిన పంట పొలాలు, కాలువ‌లు, రోడ్స్, షూటింగ్ సెట్స్ తో పాటూ ఆవులు ఉన్న ఫోటోను కూడా ప్రియాంక షేర్ చేసింది.;

Update: 2025-03-19 13:15 GMT

గ్లోబ‌ల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ప్ర‌స్తుతం రాజ‌మౌళి- సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు క‌ల‌యిక‌లో తెర‌కెక్కుతున్న మూవీలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. భారీ బ‌డ్జెట్ తో కె.ఎల్ నారాయ‌ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నుంది. గ‌త రెండు వారాలుగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఒడిశాలోని కోరాపుట్ లో జ‌రిగింది. రీసెంట్ గానే ఒడిశా షెడ్యూల్ ను చిత్ర యూనిట్ పూర్తి చేసుకుంది.

షెడ్యూల్ పూర్త‌వ‌డంతో ప్రియాంక తిరిగి న్యూయార్క్ కు వెళ్లిపోయింది. అయితే తాజాగా ప్రియాంక త‌న ఇన్‌స్టాలో ఓ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ లో కొన్ని ఫోటోలు, వీడియోలతో పాటూ ఓ సెల్ఫీ వీడియోను కూడా షేర్ చేసింది ప్రియాంక‌. షూటింగ్ పూర్త‌య్యాక ఒడిశా కోరాపుట్ నుంచి వైజాగ్ వ‌ర‌కు కారులో వ‌చ్చి వైజాగ్ నుంచి ముంబై, ముంబై నుంచి న్యూయార్క్ కు వెళ్తున్న‌ట్టు ప్రియాంక తను షేర్ చేసిన వీడియోలో తెలిపింది.

వైజాగ్ ఎయిర్ పోర్టుకు వెళ్లే దారిలో త‌న‌కు జామ‌కాయలు అమ్మే ఒకామె క‌నిపించింద‌ని, త‌న‌కు ప‌చ్చి జామ‌కాయ‌లంటే ఎంతో ఇష్టమ‌ని, కారు ఆపి ఎంత‌ని అడిగితే రూ.150 రూపాయలు అని చెప్పింద‌ని, దానికి తాను రూ.200 వ‌చ్చి చిల్ల‌ర ఉంచుకోమ‌న్నాన‌ని చెప్పింది. కానీ ఆమె మాత్రం త‌న ద‌గ్గ‌ర చిల్ల‌ర లేక‌పోవ‌డంతో త‌న‌కు ఇంకొన్ని జామ‌కాయ‌ల‌ను ఇచ్చింద‌ని, వ‌ర్కింగ్ ఉమెన్ ఎప్పుడూ డ‌బ్బుని ఊరికే తీసుకోర‌ని ప్రియాంక ఈ సంద‌ర్భంగా చెప్పుకొచ్చింది.

ఈ వీడియోతో పాటూ ప్రియాంక మ‌రికొన్ని వీడియోల‌ను కూడా షేర్ చేసింది. ఒడిశా నుంచి విశాఖ‌ప‌ట్ట‌ణం వెళ్తుండ‌గా దారిలో క‌నిపించిన పంట పొలాలు, కాలువ‌లు, రోడ్స్, షూటింగ్ సెట్స్ తో పాటూ ఆవులు ఉన్న ఫోటోను కూడా ప్రియాంక షేర్ చేసింది. ప్రియాంక ఇన్‌స్టాలో చేసిన ఈ పోస్ట్ ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతుంది. నిక్ జోనాస్ ను పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిలైపోయిన ప్రియాంక గ‌త కొన్నాళ్లుగా ఇండియ‌న్ సినిమాల్లో న‌టించ‌డం లేదు. అమెరికాలో ఉంటూ హాలీవుడ్ మూవీస్ లో న‌టిస్తున్న ప్రియాంక ఇప్పుడు ఎస్ఎస్ఎంబీ29లో న‌టిస్తుంంది.

Tags:    

Similar News