నాగార్జున కన్నా రానా బెస్ట్ అంటున్న సోనియా ఆకుల..!

నాగార్జున మీద సోనియా ఆకుల చేసిన కామెంట్స్ బిగ్ బాస్ ఆడియన్స్ ని కూడా ఇబ్బంది పెడుతున్నాయి.;

Update: 2025-03-19 13:58 GMT

బిగ్ బాస్ సీజన్ 8 లో వన్ ఆఫ్ ది క్రేజీ కంటెస్టెంట్ గా వచ్చిన సోనియా ఆకుల టాప్ 5 దాకా వెళ్లాల్సిన స్టామినా ఉన్నా కూడా ఆమె నాలుగో వారానికే ఎలిమినేట్ అయ్యింది. ఐతే తను ఎలిమినేట్ అయిన విషయంపై షో నుంచి బయటకు వచ్చాక చాలా కారణాలు చెబుతూ హోస్ట్ నాగార్జున మీద కూడా సంచలన కామెంట్స్ చేసింది సోనియా. ఆమె ఇతర హౌస్ మెట్స్ తో చేసిన కామెంట్స్ ని కేవలం ఒకలా మాత్రమే చూశారని హోస్ట్ కూడా ఆ విషయంలో వాళ్లకే సపోర్ట్ చేశారని అన్నది.

ఐతే లేటెస్ట్ గా సోనియా మరోసారి నాగార్జున హోస్టింగ్ మీద కామెంట్స్ చేసింది. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనియా హోస్ట్ గా నాగార్జున గారు ఉంటే తాను బిగ్ బాస్ కి వెళ్లనని అన్నది. ఆయన కేవలం చెవిలో బిగ్ బాస్ టీం చెప్పేది మాత్రమే విని మాట్లాడుతున్నారని అన్నది. తన విషయంలో అడల్ట్రేటెడ్ అన్న మాట చాలా పెద్దదిగా చేశారని అన్నది. హోస్ట్ అందరు చెప్పేది విని కొంత టైం తీసుకుని అయినా ఆయన సొంతంగా చెప్పాలని అన్నది సోనియా.

ఇక ఇదే షోలో నాగార్జున హోస్టింగ్ గురించి చెబుతూ గౌతం కృష్ణని షటప్ అని అనాల్సిన అవసరం లేదని ఆమె అన్నది. ఐతే తన దృష్టిలో రానా అయితే హోస్ట్ గా బెస్ట్ అని నాగార్జున గారు సెన్సిటివ్ అని.. రానా నెంబర్ వన్ యారీతో పాటు చాలా ఈవెంట్ లు హోస్ట్ గా చేశారని ఆయనకు కాస్త ఇప్పటి జనరేషన్ విషయాలు తెలుసు కాబట్టి రానా హోస్ట్ గా చేస్తే మళ్లీ బిగ్ బాస్ కి వెళ్తానని అన్నది సోనియా ఆకుల.

ఐతే బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చే కంటెస్టెంట్స్ అందరు హోస్ట్ కి సమానమే. ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ చేసే అవసరం అవకాశం ఉండదు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 నుంచి నాగార్జున హోస్ట్ గా చేస్తూ వస్తున్నారు. అలాంటిది ఆయన హోస్టింగ్ ని తప్పుపడుతూ సోనియా ఆకుల చేస్తున్న వ్యాఖ్యలు అక్కినేని ఫ్యాన్స్ ని హర్ట్ చేసేలా ఉన్నాయని చెప్పొచ్చు.

నాగార్జున మీద సోనియా ఆకుల చేసిన కామెంట్స్ బిగ్ బాస్ ఆడియన్స్ ని కూడా ఇబ్బంది పెడుతున్నాయి. షోలో ఆమె ఆట ఆడిన తీరు అందరు చూశారని ఆమె మాట్లాడినంత మాత్రాన అది కరెక్ట్ అయిపోదని అంటున్నారు.

Tags:    

Similar News