15 రోజులు కోమాలో ఉన్నా: ముమైత్ ఖాన్

తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో పలు బిగ్ ప్రాజెక్టుల్లో కనిపించిన ఆమె, తన డ్యాన్స్ మ్యూమెంట్స్‌తో అభిమానులను మెస్మరైజ్ చేసింది.;

Update: 2025-03-19 15:00 GMT

ఒకప్పటి స్టార్ ఐటెం డ్యాన్సర్‌గా మంచి క్రేజ్ అందుకున్న ముమైత్ ఖాన్ గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంది. తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో పలు బిగ్ ప్రాజెక్టుల్లో కనిపించిన ఆమె, తన డ్యాన్స్ మ్యూమెంట్స్‌తో అభిమానులను మెస్మరైజ్ చేసింది. అప్పట్లో పెద్ద సినిమాల్లో ముమైత్ తో ఒక సాంగ్ పక్కా ఉండేది. అయితే కొన్నాళ్ల అనంతరం ఆమె కెరీర్ కాస్త డీలాపడింది. టీవీ షోలతో పాటు కొన్ని ప్రత్యేక పాత్రలతో ప్రయత్నించినా, ముమైత్ కి మళ్లీ క్రేజ్ రాలేదు.

అయితే ఇటీవల, ఆమె మేకప్ & హెయిర్ అకాడమీ ప్రారంభించి మళ్లీ మీడియా ఫోకస్‌లోకి వచ్చింది. ప్రముఖ డ్యాన్సర్‌గా ఎన్నో సూపర్ హిట్ పాటల్లో అలరించిన ముమైత్ ఖాన్ అకస్మాత్తుగా తెరమరుగయ్యిందని అనేక ఊహాగానాలు వినిపించాయి. సోషల్ మీడియాలోనూ ఆమె గురించి చాలా తక్కువగా వినిపించడం, ఏమైందో అనే ఆసక్తిని పెంచింది. అయితే తాజాగా ముమైత్ ఖాన్ తన గైర్హాజరీకి గల అసలు కారణాన్ని బయటపెట్టింది. ఇది అభిమానులను ఒక్కసారిగా షాక్‌కు గురిచేసే విధంగా ఉంది.

ముమైత్ తన జీవితంలో తాను ఎదుర్కొన్న అతి పెద్ద సంఘటన గురించి వివరించింది. "ఇంట్లో డ్యాన్స్ చేస్తూ ఉండగా కాలు జారిపోయి బెడ్‌కి తల బలంగా తగిలింది. అయితే, బయటకు రక్తం రాలేదుకానీ, లోపల పెద్ద ప్రమాదం జరిగింది. అప్పుడే మా అమ్మ నన్ను హాస్పిటల్‌కి తీసుకెళ్లింది. అక్కడ డాక్టర్లు చాలా సీరియస్‌గా స్పందించి, మూడు నరాలు పూర్తిగా కట్ అయ్యాయని చెప్పారు.

వెంటనే ముంబైలోని ఓ ప్రముఖ హాస్పిటల్‌లో నాకు సర్జరీ చేశారు. అయితే, అనుకోకుండా 15 రోజులు కోమాలో ఉండాల్సి వచ్చింది" అని చెప్పుకొచ్చింది ముమైత్. ఆమె చెప్పిన మరొక షాకింగ్ విషయం కూడా ఆశ్చర్యం కలిగిస్తోంది. కోమా నుంచి బయటకు వచ్చిన తర్వాత తన మెమరీలో మార్పు వచ్చిందని చెప్పింది. "15 రోజుల తర్వాత నాకే తెలియకుండా మెలకువ వచ్చింది. కానీ అప్పటికే నా మెమరీ లాస్‌కి గురైంది. ముఖాలు గుర్తుపట్టలేకపోయాను. కొన్ని రోజుల పాటు మళ్లీ ఎవరితోనూ మాట్లాడలేను. కొన్ని సంఘటనలు ఇప్పటికీ గుర్తుకు రావు. అవి గుర్తు చేసుకోవడానికి చాలా ఒత్తిడిగా అనిపిస్తుంది. అయితే ప్రస్తుతం నేను పూర్తిగా కోలుకున్నాను" అంటూ ఆమె వివరించింది.

ప్రస్తుతం ముమైత్ ఖాన్ మళ్లీ తన కెరీర్‌ని ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. గతంలో స్పెషల్ సాంగ్స్ తో పాటు ముమైత్ పలు పవర్ఫుల్ క్యారెక్టర్లు కూడా చేసింది. మైసమ్మ ఐపీఎస్, పున్నమి నాగ్ లాంటి సినిమాల్లో లీడ్ రోల్స్ చేసింది. ఇక చివరగా 2019లో RDX లవ్ అనే సినిమాలో కనిపించిన ముమైత్ బిగ్ బాస్ షోలో కూడా కాంటెస్టెంట్ గా పాల్గొంది. ఇక ఇప్పుడు ఆమె వేసే అడుగులు ఏ విధంగా ఉంటాయో చూడాలి.

Tags:    

Similar News