పవన్ -బాలయ్య మధ్య యుద్దం తప్పదా!
బాలయ్య నార్త్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా చిత్రీకరణ జరుపుతున్నారు.;
నటసింహ బాలకృష్ణ-పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మధ్య వార్ తప్పదా? బాలయ్య సై అంటే పవన్ సైసై అంటాడా? అంటే సన్నివేశం అలాగే కనిపిస్తుంది. బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో `అఖండ-2 శివతాండవం` భారీ అంచనాల మధ్య తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మరోసారి బాలయ్య నట విశ్వరూపం తాండవంలో చూబోతున్నారు. ఎగ్జోటిక్ లోకేషన్స్ లో షూటింగ్ జరుగుతుంది.
బాలయ్య నార్త్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా చిత్రీకరణ జరుపుతున్నారు. ఇప్పటికే కుంభమేళాలో చిత్రీకరించిన సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా ఉంటాయని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా రిలీజ్ తేదీని కూడా బోయపాటి ముందే ప్రకటించారు. అన్ని పనులు పూర్తి చేసి సెప్టెంబర్ 25 రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సినిమా డిలే అయ్యే అవకాశం లేదు. చెప్పింది చెప్పినట్లు చేయడం బాలయ్య కు ఆలవాటు.
పైగా బాలయ్య సినిమా రిలీజ్ తేదీ ఫిక్స్ అయిందంటే? అదో సెంటిమెంట్. దాని వెనుక ఎన్నో లాజిక్కు లు ఉంటాయి. మార్చడానికి వీలు లేని టెక్నికల్ విషయాలు ఉంటాయి. అయితే సరిగ్గా ఇదే తేదీకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న `ఓజీ` సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయంటున్నారు. `ఓజీ` షూటింగ్ డిలే అవుతున్న నేపథ్యంలో యూనిట్ సెప్టెంబర్ 25వ తేదీని పరిశీలిస్తున్నారు.
అదే జరిగితే బాలయ్య-పవన్ మధ్య బాక్సాఫీస్ వద్ద యుద్దమే. పవన్ వస్తున్నాడని బాలయ్య వెనక్కి తగ్గరు. పైగా సీనియర్ నటుడు. రాజీ పడే ప్రశక్తే ఉండదు. ఇంకా బాలయ్య పెద్దరికాన్ని దృష్టిలో పెట్టుకుని పవన్ తగ్గాల్సి ఉంటుంది. `ఓజీ` రిలీజ్ తేదీ అదే రోజు అయితే ఖరారైతే గనుక `సంబరాల ఏటిగట్టు` వాయిదా పడుతుంది. ఇప్పటికే ఈ సినిమా సెప్టెంబర్ 25 ప్రకటించిన సంగతి తెలిసిందే.