పిక్‌టాక్‌ : పెళ్లి తర్వాత చైతూ, శోభిత ఫస్ట్‌ టైమ్‌..!

పెళ్లి తర్వాత నాగ చైతన్య, శోభిత కలిసి మొదటి సారి మ్యాగజైన్‌కి ఫోటో షూట్‌ ఇచ్చారు. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.;

Update: 2025-03-19 11:39 GMT

నాగ చైతన్య, శోభితల జోడీ మోస్ట్‌ బ్యూటీఫుల్‌ జోడీ అంటూ సోషల్‌ మీడియాలో వారి ఫోటోలు ఎప్పటికప్పుడు వైరల్‌ అవుతూ ఉంటాయి. తాజాగా సోషల్‌ మీడియాలో వీరిద్దరు కలిసి ఉన్న ఫోటోలు మరోసారి వైరల్‌ అవుతున్నాయి. అయితే ఈసారి జంటగా ఒక ప్రముఖ మ్యాగజైన్‌ కవర్‌ పై కనిపించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ప్రముఖ వోగ్‌ మ్యాగజైన్‌ కవర్‌ పై నాగ చైతన్య, శోభితల జోడీ కన్నుల విందు చేసింది. సింపుల్‌ అండ్‌ స్వీట్‌ లుక్‌లో నాగ చైతన్య కనిపించగా, శోభిత కాస్త సెలబ్రెటీ లుక్‌తో చూపరుల దృష్టిని ఆకర్షించింది. మొత్తానికి చైతూ, శోభితల ఫోటో షూట్‌ నెట్టింట అందరి దృష్టిని ఆకర్షించడంతో పాటు, కొత్త జంటకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

 

పెళ్లి తర్వాత నాగ చైతన్య, శోభిత కలిసి మొదటి సారి మ్యాగజైన్‌కి ఫోటో షూట్‌ ఇచ్చారు. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సెలబ్రెటీ భార్య భర్తల ఫోటోలు ఎప్పుడైనా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూనే ఉంటాయి. అయితే వోగ్‌ మ్యాగజైన్‌ కోసం తీసుకున్న ఫోటోలు కావడంతో ఈ ఫోటోలు మరింత వైరల్‌ అవుతున్నాయి. వోగ్‌ మ్యాగజైన్‌కి ఫోటో షూట్‌ ఇవ్వడం మాత్రమే కాకుండా ప్రత్యేక ఇంటర్వ్యూ ని సైతం ఈ జంట ఇచ్చారు. పెళ్లి తర్వాత మొదటి సారి ఈ జంట కలిసి ఇంటర్వ్యూ ఇవ్వడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పెళ్లికి ముందు పరిస్థితులు పెళ్లి తర్వాత పరిస్థితుల గురించి వీరిద్దరు ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

నాగ చైతన్య, శోభిత వారి పెళ్లి గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ ప్రేమకు మాతృభాష, సినిమా కెరీర్‌ అడ్డు కాలేదన్నారు. తమ ప్రేమ కథ చాలా సహజంగా జరిగిందన్నారు. ప్రతి విషయాన్ని చర్చించుకుని నిర్ణయించుకుంటున్నామని అన్నారు. కుటుంబ సభ్యులం అందరం కలిసి భోజనం చేయడం, ఎక్కువ సమయం గడుపుతున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తాము ఇద్దరం సంతోషకరమైన జీవితాన్ని సాగిస్తున్నామని చెప్పుకొచ్చారు. నాలుగు, ఐదు నెలలు కొత్త ప్రాజెక్ట్‌లకు వెళ్లే ఆలోచన లేదు అన్నట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇద్దరం సమయం దొరికితే సంతోషంగా సమయాన్ని గడిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. మేము ఇద్దరం ముందు ముందు పెద్ద ప్రాజెక్ట్‌లతో బిజీ కాబోతున్నామని తెలియజేశారు.




పెళ్లి తర్వాత విడుదలైన 'తండేల్‌' సినిమాతో నాగ చైతన్య భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అంతే కాకుండా నాగ చైతన్య కెరీర్‌లో మొదటి రూ.100 కోట్ల సినిమాగా తండేల్‌ నిలిచింది. చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన తండేల్‌ సినిమాలో హీరోయిన్‌గా సాయి పల్లవి నటించింది. తండేల్‌ రాజు పాత్రలో నాగ చైతన్య నటించి కెరీర్‌ బెస్ట్‌ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడంటూ ప్రశంసలు దక్కించుకున్నాడు. తండేల్‌ వంటి సూపర్‌ హిట్‌ సినిమా తర్వాత నాగ చైతన్య నుంచి రాబోతున్న సినిమా ఏంటి అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

చైతూ తదుపరి సినిమా ఇప్పటికే కార్తీక్‌ దండు దర్శకత్వంలో కన్ఫర్మ్‌ అయింది. ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్ జరుగుతున్న సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ను త్వరలో ప్రారంభించి వచ్చే ఏడాదిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు సమాచారం అందుతోంది. మరో వైపు శోభిత సైతం పలు హిందీ ప్రాజెక్ట్‌లను లైన్‌లో పెట్టింది. త్వరలోనే ఆమె నటించిన హిందీ సినిమాతో పాటు వెబ్‌ సిరీస్‌ సైతం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News