ఆ హీరో కొడుక్కి కీర్తి సురేష్ రిలేషన్..!

జున్ను తనని అత్త అని పిలుస్తాడు.. తనకు హ్యాపీ బర్త్ డే చెప్పినప్పుడు మిస్ యు.. సీ యూ అనే మాటను ముద్దుగా మూసీ సుయీ అంటూ చెబుతాడని

Update: 2024-07-31 06:01 GMT

న్యాచురల్ స్టార్ నానితో కీర్తి సురేష్ రెండు సినిమాల్లో నటించింది. మొదట నేను లోకల్ లో నటించిన ఈ ఇద్దరు మళ్లీ దసరాలో కలిసి నటించారు. నాని, కీర్తి సురేష్ అంటే ఆ సినిమా హిట్ అనేలా సెంటిమెంట్ ఏర్పరచుకున్నారు. ఐతే నాని తో సినిమాలు చేస్తున్న టైం లో అతని ఫ్యామిలీతో ముఖ్యంగా నాని కొడుకు అర్జున్ తో కీర్తి సురేష్ చాల క్లోజ్ అయ్యిందట. ఇదే విషయాన్ని ఆమె రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

జున్ను తనని అత్త అని పిలుస్తాడు.. తనకు హ్యాపీ బర్త్ డే చెప్పినప్పుడు మిస్ యు.. సీ యూ అనే మాటను ముద్దుగా మూసీ సుయీ అంటూ చెబుతాడని. ఎప్పుడైనా తనకు లో అనిపించినప్పుడు ఆ వాయిస్ ఓవర్ వింటానని చెప్పింది కీర్తి సురేష్. ఎప్పుడు హైదరాబాద్ వెళ్లినా జున్ను దగ్గరకు వెళ్తానని కీర్తి సురేష్ చెప్పింది. ప్రస్తుతం కీర్తి సురేష్ నాని ఫ్యామిలీ గురించి ముఖ్యంగా ఆ హీరో తనయుడు అర్జున్ గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇక కీర్తి కెరీర్ విషయానికి వస్తే బాలీవుడ్ లో ఈమధ్యనే వరుస సినిమా ఆఫర్లు అందుకుంటున్న అమ్మడు. అక్కడకు వెళ్లాక గ్లామర్ డోస్ పెంచిందన్న టాక్ వినిపిస్తుంది. ఐతే తెలుగులో దసరా తర్వాత కీర్తి సురేష్ కి ఒక్క ఆఫర్ కూడా రాలేదు. కల్కి సినిమాలో బుజ్జి పాత్రకు తన వాయిస్ ఇచ్చి మెప్పించింది కీర్తి సురేష్.

దసరా కాంబినేషన్ లో నాని, శ్రీకాంత్ ఓదెల మరో సినిమా చేయబోతున్నారు. ఒకవేళ హీరోయిన్ గా మళ్లీ కీర్తి సురేష్ నే రిపీట్ చేస్తారా అన్న డౌట్ కూడా ఉంది. అదే జరిగితే మాత్రం దసరా కాంబో మరో సూపర్ హిట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారని చెప్పొచ్చు. అటు తమిళంలో కూడా తన దూకుడు తగ్గించింది కీర్తి సురేష్. బాలీవుడ్ లో వస్తున్న ఆఫర్లు ఆమె కెరీర్ కు ఎంకరేజ్మెంట్ అందిస్తున్నాయి. మరి ఇక్కడ మహానటిగా గుర్తింపు తెచ్చుకుని నేషనల్ అవార్డ్ కూడా అందుకున్న కీర్తి సురేష్ బాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ తెచ్చుకుంటుందో చూడాలి. కీర్తి మాత్రం బాలీవుడ్ లో పాగా వేయాలనే ఉద్దేశంతోనే అక్కడ పర్ఫెక్ట్ ప్లానింగ్ తో సినిమాలు ఓకే చేస్తుందని తెలుస్తుంది.

Tags:    

Similar News