కీర్తి సురేష్ ఎనదర్ రాంగ్ స్టెప్..!
ఇలాంటి టైం లో ఇలాంటి రొటీన్ కథలకు ముఖ్యంగా సిస్టర్ రోల్స్ కి ఓకే చెప్పకపోవడమే బెటర్ అని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు.
ఈ ఇయర్ మార్చిలో దసరాలో వెన్నెల పాత్రలో నటించి మరోసారి తన ప్రతిభ చాటిన మహానటి కీర్తి సురేష్ నేడు మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ లో ఆయన సిస్టర్ రోల్ లో నటించారు. మెహర్ రమేష్ డైరెక్షన్ లో తెరకెక్కిన భోళా శంకర్ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అనిల్ సుంకర నిర్మించారు. వేదాళం రీమేక్ గా వచ్చిన ఈ సినిమా 80, 90ల నాటి ఔట్ డేటెడ్ సినిమా టెంప్లేట్ తో స్క్రీన్ ప్లే రాసుకోవడంతో సినిమా చూసిన మెగా ఫ్యాన్స్ కూడా బాబోయ్ అనేస్తున్నారు.
అందులో నటించిన కీర్తి సురేష్ కూడా ఈ సినిమా చేయడం రాంగ్ స్టెప్ అని చెప్పుకుంటున్నారు. చిరు సినిమాలో ఛాన్స్ అనగానే ఏ హీరోయిన్ అయినా లక్కీగా ఫీల్ అవుతుంది. ముఖ్యంగా సీనియర్ హీరోలకు జోడీగా అంటే ఆలోచిస్తారేమో కానీ సిస్టర్ రోల్ కాబట్టి వెంటనే ఓకే చెప్పేస్తారు. ఆల్రెడీ సూపర్ స్టార్ రజినీకాంత్ పెద్దన్న సినిమాలో ఆయనకు సిస్టర్ గా చేసింది కీర్తి సురేష్. ఆ సినిమా కూడా నిరాశపరచగా ఇప్పుడు చిరుతో చేసిన భోళా శంకర్ కూడా ఆశించిన ఫలితాన్ని రాబట్టలేదు.
ముఖ్యంగా కీర్తి సురేష్ మంచి ఫాం లో ఉన్న ఇలాంటి టైం లో ఇలాంటి రొటీన్ కథలకు ముఖ్యంగా సిస్టర్ రోల్స్ కి ఓకే చెప్పకపోవడమే బెటర్ అని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు. మహానటి లో కీర్తి సురేష్ టాలెంట్ ఏంటో ఆమె ఎంత గొప్పగా నటించగలదో అందరు చూశారు. అలాంటి టఫ్ పాత్రలు.. కథలతో కీర్తిని చూడాలని ఆడియన్స్ కోరుతారు. కానీ మన మేకర్స్ మాత్రం కీర్తి సురేష్ కి రొటీన్ పాత్రలు ఇస్తూ షాక్ ఇస్తున్నారు.
మహానటి తర్వాత మొన్న దసరాలో వెన్నెల పాత్రలో తన సత్తా చాటిన కీర్తి సురేష్ సినిమా లెక్క పెంచుకోవాలనే ఆలోచనతో కాకుండా ఒకటి రెండు చేసినా తన ఇమేజ్ కి తగిన పాత్రలు చేస్తే బెటర్ అని ఆమె అభిమానులు భావిస్తున్నారు. ఒక బలహీనమైన కథకు ఎంత గొప్ప స్టార్ కాస్ట్ ని పెట్టినా దాని రిజల్ట్ ఒకేలా ఉంటుంది.
భోళా శంకర్ సినిమా చిరు మీద అభిమానంతో కీర్తి సురేష్ చేసి ఉండొచ్చు కానీ ఈ సినిమా ఫెయిల్యూర్ ఆమెను వెంటాడుతుంది. దసరా ముందు వరకు కీర్తి పని అయిపోయింది అనుకున్న వారికి వెన్నెల పాత్రతో సర్ ప్రైజ్ చేసిన అమ్మడు అలాంటి ప్రత్యేకత ఉన్న పాత్రలే చేయాలని సూచిస్తున్నారు. అభిమానుల రిక్వెస్ట్ ని కీర్తి సురేష్ పరిగణలోకి తీసుకుంటుందా లేదా అన్నది చూడాలి.