ఘాటైన సొగసులతో రొమాంటిక్ హీరోయిన్
"భయంకరమైన సోల్, ధైర్యవంతమైన హృదయం, మరియు దృఢమైన మనస్సు" అంటూ క్యాప్షన్ జతచేసిన ఈ ఫోటోలు యువతను మరింత ఆకర్షిస్తున్నాయి.
టాలీవుడ్ యువతను తన గ్లామర్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకుంటూ, సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచే కేతిక శర్మ మరోసారి తన ప్రత్యేకతను చూపించింది. కేవలం గ్లామర్ లుక్‌కే పరిమితం కాకుండా ట్రెడిషనల్ టచ్‌ను జోడిస్తూ తనలోని సొగసును మరింత అందంగా ప్రదర్శించింది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి. "భయంకరమైన సోల్, ధైర్యవంతమైన హృదయం, మరియు దృఢమైన మనస్సు" అంటూ క్యాప్షన్ జతచేసిన ఈ ఫోటోలు యువతను మరింత ఆకర్షిస్తున్నాయి.
కేతిక గ్లామరస్ సారీలో అద్భుతంగా కనిపిస్తుండగా, ఆమె వేసుకున్న బ్రాండెడ్ హ్యాండ్‌మేడ్ ఆభరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నెవ్వర్ బిఫోర్ అనేలా ఓ ట్రెడిషనల్ ఘాటైన లుక్‌లో దర్శనం ఇచ్చిన కేతిక, ఆ ఫోటోషూట్ ద్వారా తనలోని కొత్త కోణాన్ని చూపించింది. ఎల్లప్పుడూ గ్లామర్ డోస్‌లో మాత్రమే కాకుండా, ఈసారి తన స్టన్నింగ్ లుక్‌తో అందరి మనసులను దోచుకుంది.
ఈ తరహా ఫోటోషూట్ల ద్వారా కేతిక యూత్‌లో మరింత క్రేజ్ సంపాదించుకుంటోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటం వల్ల తన అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటూ, సరికొత్త ఫ్యాషన్ ట్రెండ్స్‌ను ప్రదర్శించడం కేతిక ప్రత్యేకత. ఇలాంటి ప్రెజెన్స్‌తో టాలీవుడ్‌లో మరిన్ని అవకాశాలు దక్కించుకోవాలని కేతిక ఆశిస్తోంది. ఇక ఆమె కెరీర్ విషయానికి వస్తే ఇటీవల అవకాశాలు తగ్గాయి.
2021లో రొమాంటిక్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన అమ్మడు ఆ తరువాత లక్ష్య -రంగ రంగ వైభవంగా సినిమాల్లో హీరోయిన్ గా అవకాశాలు అందుకుంది. కానీ ఏ సినిమా కూడా అమ్మడికి సరైన సక్సెస్ ఇవ్వలేదు.
ఆ మధ్య బ్రో సినిమాలో నటించినప్పటికీ అదేమీ పెద్దగా క్లిక్ కాలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం తన గ్లామర్ తోనే ఫాలోవర్స్ ను పెంచుకుంటోంది. అలాగే వెబ్ సీరీస్ లలో కూడా నటించేందుకు ఆమె ఆసక్తి చూపుతోంది. మరి ఈ గ్లామర్ షో ద్వారా కేతిక ఏమైనా కొత్త అవకాశాలు అందుకుంటుందో లేదో చూడాలి.