స‌ర్ఫ్ షాప్ ముందు దొరికిపోయిన యంగ్ హీరోయిన్

ఈ భామ చిట్టి పొట్టి నిక్క‌రులో స‌ర్ఫ్ షాప్ ముందు హొయ‌లు పోయిన తీరును ఫోటోషూట్ లో బంధించారు స్టిల్ ఫోటోగ్రాఫ‌ర్.

Update: 2024-12-02 04:22 GMT

టాలీవుడ్‌లో యువ‌హీరోల స‌ర‌స‌న న‌టించింది కేతిక శ‌ర్మ‌. సోష‌ల్ మీడియా ఇన్ ఫ్లూయెన్స‌ర్ గా, టాప్ మోడ‌ల్ గా సుప‌రిచిత‌మైన కేతిక పూరి జ‌గ‌న్నాథ్ త‌న‌యుడు ఆకాశ్ స‌ర‌స‌న రొమాంటిక్ అనే మూవీతో తెరంగేట్రం చేసింది. కానీ తొలి సినిమా ప‌రాజ‌యం పాల‌వ్వ‌డం నిరాశ‌ప‌రిచింది. ఆ త‌ర్వాతా నాగ‌శౌర్య స్పోర్ట్స్ డ్రామా- ల‌క్ష్య‌లో న‌టించినా కానీ అది కూడా క‌లిసి రాలేదు. ఇటీవ‌ల ప‌వ‌న్- సాయి దుర్గ తేజ్ (సాయిధ‌ర‌మ్ తేజ్) ల‌తో న‌టించిన బ్రోలో త‌న పాత్ర‌కు అంత గుర్తింపు రాలేదు. కార‌ణం ఏదైనా కేతిక త‌న అంద‌చందాలు ప్ర‌తిభ‌కు త‌గ్గ అవ‌కాశాల్ని మాత్రం అందుకోలేక‌పోయాన‌నే నిరాశ‌తో ఉంది.

ఇటీవ‌ల టాలీవుడ్ లో ఆశించిన అవ‌కాశాల్లేవ్. దీంతో కేతిక ఎప్ప‌టిలానే సోష‌ల్ మీడియాల్లో ఇన్ ఫ్లూయెన్స‌ర్ గా కొన‌సాగుతోంది. ఇన్ స్టా స‌హా ప‌లు సామాజిక‌ మాధ్య‌మాల్లో వ‌రుస ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తోంది. కేతిక తాజాగా షేర్ చేసిన ఓ ఫోటోషూట్ ఇంట‌ర్నెట్ లో దుమారంగా మారింది. ఈ ఫోటోషూట్ లో కేతిక ఎప్ప‌టిలానే బోల్డ్ లుక్ లో చెల‌రేగిపోయింది.

ఈ భామ చిట్టి పొట్టి నిక్క‌రులో స‌ర్ఫ్ షాప్ ముందు హొయ‌లు పోయిన తీరును ఫోటోషూట్ లో బంధించారు స్టిల్ ఫోటోగ్రాఫ‌ర్. కేతిక పొట్టి డెనిమ్ లో థై సొగ‌సుల‌ను ప్ర‌ద‌ర్శిస్తూ రెచ్చిపోయింది. ఇక కాంబినేష‌న్ ప‌ట్టీల బ్లౌజ్ లో గ్లామ్ ఎలివేష‌న్ ప్ర‌త్యేకంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఇంత‌కీ సర్ఫ్ షాప్ లో కేతిక ఏం చేస్తోంది? అంటే.. భారీగా షాపింగ్ చేస్తోంది. త‌న‌కు న‌చ్చిన దుస్తులు, స్పోర్ట్స్ డ్రెస్ లను కొనుగోలు చేస్తుంది! అంటూ అభిమానులు గెస్ చేస్తున్నారు. ఫేవ‌రెట్ మంథ్ పేరుతో ఈ ఫోటోషూట్ ని కేతిక ఇన్ స్టాలో షేర్ చేయ‌గా అది వైర‌ల్ గా మారింది. కేతిక ఈ లుక్ లో టూ హా* గా ఉందంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Tags:    

Similar News