ఖుషీ కపూర్ స్టన్నింగ్ లుక్ వైరల్
ఇన్నాళ్లు అక్క జాన్వీ కపూర్ హొయలు చూసాం. ఇప్పుడు చెల్లి ఖుషీ కపూర్ ట్రీట్ షురూ అయింది.
ఇన్నాళ్లు అక్క జాన్వీ కపూర్ హొయలు చూసాం. ఇప్పుడు చెల్లి ఖుషీ కపూర్ ట్రీట్ షురూ అయింది. ఈ అక్కా చెల్లెళ్లు ఎక్కడ కనిపించినా ఫ్యాన్స్ గుండెలు లయ తప్పుతున్నాయ్. ప్రేమ పవనాలు వీస్తున్నాయ్. బోయ్స్ మతి చెడి మంచమెక్కుతున్నారు!
ఇటీవల ది ఆర్చీస్ తో నటిగా ప్రశంసలు అందుకున్న ఖుషీకపూర్ వరుస ఫోటోషూట్లతో హవాను పెంచేస్తోంది. తాజాగా పాపులర్ మ్యాగజైన్ గ్రాజియా కవర్ పేజీపై ఈ బ్యూటీ దర్శనమిచ్చిన తీరు కుర్రకారులో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఫోటోషూట్ కోసం రకరకాల గెటప్పుల్లో ఖుషీ కనిపించింది. డిజైనర్ దుస్తులలో ఎంతో అందంగా కనిపిస్తోంది. ముఖ్యంగా బ్లూ కలర్ షిమ్మరీ దుస్తుల్లో ఖుషీ స్టైల్ స్టేట్ మెంట్ అందరినీ ఆకర్షిస్తోంది. థైస్లిట్ బాటమ్... టైట్ టాప్ ధరించిన ఖుషీ అందాలు యూత్ కి కునుకుపట్టనివ్వని ట్రీట్ అనడంలో సందేహం లేదు. ఖుషీ నెక్ట్స్ ఏంటి? అన్నది అటుంచితే ఇంతలోనే భారీ ఫాలోయింగ్ ని పెంచుకునేందుకు పాపులర్ మ్యాగజైన్ లకు కవర్ స్టార్ గా మారుతోంది. ఖుషీ తన అక్క జాన్వీని మించిపోతుందేమో చూడాలి.
కరణ్ కాఫీలో కపూర్ సిస్టర్స్ హంగామా:
గత రాత్రి ఖుషీ కపూర్ `కాఫీ విత్ కరణ్ సీజన్ 8`లో కనిపించింది. తన సోదరి జాన్వీ కపూర్‌తో కలిసి కరణ్ జోహార్ హోస్ట్ చేసిన చాట్ షోలో ఖుషీ ఎంతో జోష్ ప్రదర్శించింది. వారి సంభాషణ భావోద్వేగాలు - వినోదంతో ఆకట్టుకున్నాయి. ఖుషీ తనదైన యూనిక్ శైలితో చాలా మంది హృదయాలను గెలుచుకుంది.
ఈ షోలో సోదరీమణులు ఇద్దరూ కెరీర్ సహా చాలా అంశాలపై మాట్లాడారు. ది ఆర్చీస్‌లో బెట్టీ కూపర్ పాత్రను పోషించడంపై ఖుషీ ఎంతో భావోద్వేగంగా మాట్లాడింది. నటిగా ఆరంగేట్రం గనుక.. నేను కేకలు వేస్తూ ఏడ్వడం ప్రారంభించాను. చాలా కాలంగా నటనలోకి రావాలనుకుంటున్నాను గనుక ఇలా జరిగిందిఅని తెలిపింది. జోయా బెట్టీ పాత్ర గురించి చెప్పినప్పుడు నేను భావోద్వేగానికి గురయ్యాను అని ఖుషీ వెల్లడించింది. ఖుషీ నటనా రంగ ప్రవేశం ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఓటీటీ తెరపైనా షోలతో అలరిస్తోంది. ఖుషీ తదుపరి సైఫ్ ఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్‌తో కలిసి సర్జమీన్లో నటించవచ్చని పుకార్లు వినిపిస్తున్నాయి