అక్కలా చెల్లి ఒళ్లు వొంచదా?
బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ ఫిటెనెస్ విషయంలో ఎంత కేరింగ్ తీసుకుంటుందన్నది చెప్పాల్సిన పనిలేదు
బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ ఫిటెనెస్ విషయంలో ఎంత కేరింగ్ తీసుకుంటుందన్నది చెప్పాల్సిన పనిలేదు. డే లో కొంత సమయాన్నిఫిట్ నెస్ కోసం కేటాయిస్తుంది. ఉదయాన్ని జిమ్ కి వెళ్లడం.. అవసరం మేర హెవీ వెయిట్స్ ఎత్తడం.. యోగాసనాలు తప్పనిసరిగా భావిస్తుంది. డైట్ విషయంలోనూ అంతే స్ట్రిక్ట్ గా ఉంటుంది. రోజువారీ వ్యాయామాల్లో కార్డియో స్ర్టెంత్ ట్రైనింగ్ యోగా ఉంటాయి.
ఉదయం ముందుగా రన్నింగ్.. సైక్లింగ్ లేదా డ్యాన్స్‌తో 45 నిమిషాల కార్డియో సెషన్ ఉంటుంది.స్క్వాట్స్.. పుషప్స్.. లంగెస్.. వెయిట్ లిఫ్టింగ్ తదితర వ్యాయామాలు చేస్తుంది. అటుపై కొంత సమయం యోగాకి కేటాయిస్తుంది. ఒత్తిడిని అధిగ మించేదుకు ధ్యానం చేస్తుంది. ఇలా తన ఫిట్ నెస్ కి సంబంధించి రోజుకో రకమైన సెషన్ అనుసరిస్తుంది. మరి సిస్టర్ కం కాంబోయే హీరోయిన్ ఖుషీ కపూర్ ఫిట్ నెస్ విషయంలో ఎలా ఉంటుంది? అక్క లా చెల్లి కూడా అంతే కమిట్ మెంట్ తో వ్యవహరిస్తుందా? లేకపోతే ఏదో చేసాం? అంటే చేసాం అన్నట్లు వ్యవహరిస్తుందా? అంటే రెండవదాన్ని ఖాయం చేసుకోవాలేమో అనిపిస్తుంది.
ఖుషీ కపూర్ అక్కలా సిన్సియర్ కాదుట. జిమ్ములు..యోగాలు అంటే గిట్టవని కాదు గానీ....చాలా తక్కువ సమయమే వాటి కోసం కేటాయిస్తుందిట. అవసరమైన కొన్ని ఎక్సర్ సైజులు తప్ప ఒళ్లు హూనం అయ్యేలా ఎక్సర సైజ్ లుచేయదట. ముఖ్యమైన పనులు గట్రా ఉంటే ఆ రోజు సెషన్ లేనట్లేనంట. అయితే డైట్ విషయంలో మాత్రం చాలా సీరియస్ గా ఉంటుందిట. ఏది పడితే అది అస్సలు తినదుట.
కేవలం విటమిన్లు, పోషకాలు, పీచుపదార్థాలతో ఆరోగ్యకరమైన, సమతుల ఆహారం మాత్రమే తీసుకుం టుందిట. ఉదయం బ్రేక్ పాస్ట్ అంటూ ఏది ఉండదట. కొన్ని రకాల లైట్ మొలకాలు లాంటివి తీసుకుని మధ్యాహ్నం లంచ్ చేస్తుందిట. తాను సన్నగా ఉండటానికి కారణంగా ఈ రకమైన డైట్ ఫాలో అవ్వడమే అంటోంది. పరిమితంగా పుడ్ తీసుకుంటే అరోగ్య సమస్యలు రావు అంటోంది. అయితే తీసుకునే ఆ పుడ్ లో అన్ని రకాల పోషకాలు ఉండేలా చూసుకోమంటోంది.