నాగార్జున సెంచ‌రీ 'మ‌నం'లా క్లాసిక్!

నాగార్జున ఓ మంచి 'మ‌నం' లాంటి క్లాసిక్ చిత్రంలో న‌టించాల‌ని ఆశ‌ప‌డుతున్నారుట‌.;

Update: 2025-03-19 19:00 GMT

కింగ్ నాగార్జున 100వ చిత్రం చేరువ‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే కింగ్ సెంచ‌రీపై చాలా మంది ద‌ర్శ‌కులు క‌న్నేసారు. పూరి జ‌గ‌న్నాధ్, మోహ‌న్ రాజా, త‌మిళ్ డైరెక్ట‌ర్ న‌వీన్ స‌హాప‌లువురు నాగార్జున‌కు స్టోరీలు వినిపించి రెడీగా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ఆ ఛాన్స్ ఎవ‌రికి ద‌క్కుతుంది? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. అయితే అక్కినేని కాంపౌండ్ నుంచి తాజాగా వినిపిస్తోన్న మాట ఏంటి? అంటే నాగార్జున 100వ సినిమా విష‌యంలో పైన చెప్ప‌బ‌డిన ద‌ర్శ‌కులు ఎవ‌రూ కింగ్ విజ‌న్ కి ఏమాత్రం స‌రిపోవ‌డం లేదుట‌.

నాగార్జున ఓ మంచి 'మ‌నం' లాంటి క్లాసిక్ చిత్రంలో న‌టించాల‌ని ఆశ‌ప‌డుతున్నారుట‌. అందులో కుమారులు నాగ‌చైత‌న్య‌, అఖిల్ కూడా భాగ‌మ‌వ్వాల‌ని...ఎవ‌రు క‌థ వినిపించినా? త‌న‌తో పాటు వార‌సుల్ని కూడా భాగం అయ్యే క‌థ అయితే బాగుంటుంద‌ని భావిస్తున్నారుట‌. ల్యాండ్ మార్క్ చిత్రం కెరీర్ లో ఏ న‌టుడైనా గొప్ప‌గా మిగిలిపోవాల‌ని కోరుకుంటారు.

అందుకే నాగార్జున త‌న కుటుంబానికి బాగా క‌లిసొచ్చిన క్లాసిక్ స్టోరీతోనే వెళ్లాల‌నుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. అక్కినేని ఫ్యామిలీ అంతా ల‌వ‌ర్ బోయ్ ఇమేజ్ ఉన్న నటులే. ఏఎన్నార్ నుంచి అఖిల్ వ‌ర‌కూ. మాస్ ఇమేజ్ కోసం ప్ర‌య‌త్నించినా ప్ర‌తీసారి వైఫ‌ల్య‌మే ఎదురైంది. అందుకే కింగ్ సెంచ‌రీ విష‌యంలో ఓ క్లారిటీతో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

మ‌రి ఆ త్రయాన్ని క‌ల‌పాలంటే క‌చ్చితంగా సీనియ‌ర్ అయితేనే ప‌న‌వుతుంది. ఆ ఫ్యామిలీ తో మంచి బాండింగ్ కూడా క‌లిగి ఉండాలి. టాలీవుడ్ లో అలాంటి డైరెక్ట‌ర్లు ఎవ్వ‌రూ లేరు. కాబ‌ట్టి మ‌ళ్లీ 'మ‌నం' ఫేం విక్ర‌మ్. కె. కుమార్ రంగంలోకి దిగాల్సిందే.

Tags:    

Similar News