అప్పుడు మోహన్ బాబు.. ఇప్పుడు కిరణ్ అబ్బవరం
ఒకప్పుడు హీరోలు పోషించిన పాత్రలను ఈతరం హీరోలు పోషించడం దాదాపు అసాధ్యం అన్నట్లుగా పరిస్థితి ఉంది.
ఒకప్పుడు హీరోలు పోషించిన పాత్రలను ఈతరం హీరోలు పోషించడం దాదాపు అసాధ్యం అన్నట్లుగా పరిస్థితి ఉంది. సీనియర్ హీరోలు ఇమేజ్ ను పక్కన పెట్టి సినిమాలు చేసే వారు. కానీ ఇప్పుడు మాత్రం హీరోలు తమ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని మరీ సినిమాలు చేస్తున్నారు.
కొందరు మాత్రం ఇప్పటికి కూడా కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ, విభిన్నమైన కాన్సెప్ట్ తో సినిమాలు చేస్తూ ఉన్నారు. పాతిక సంవత్సరాల క్రితం మోహన్ బాబు హీరోగా పోస్ట్ మ్యాన్ అనే సినిమా వచ్చింది. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.
ఇప్పుడు అదే కాన్సెప్ట్ తో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం సినిమా చేయబోతున్నాడు. సందీప్ - సుజీత్ దర్శక ద్వయం ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు. 1980 నేపథ్యంలో సాగే పీరియాడిక్ డ్రామా తో ఈ సినిమా రూపొందుతుంది.
కరుణ అనే కొత్త కుర్రాడి దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం 'దిల్ రుబా' అనే సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తో పాటు సమాంతరంగా పోస్ట్‌మ్యాన్ సినిమాను చేసేందుకు కమిట్ అయ్యాడని తెలుస్తోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఒక విభిన్నమైన కాన్సెప్ట్ తో ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది.
1980 కాలంలో ఫోన్ లు లేకపోవడంతో పూర్తిగా ఉత్తరాలతోనే కమ్యూనికేషన్ నడిచేది. అందుకే అప్పటి బ్యాక్ డ్రాప్ తో సినిమా ను రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది. అప్పుడు పోస్ట్ మ్యాన్ పరిస్థితి ఎలా ఉండేది అనే కాన్సెప్ట్ ను చూపించే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు మోహన్ బాబు పోస్ట్ మ్యాన్ గా హిట్ కొడితే ఇప్పుడు కిరణ్ అబ్బవరం సక్సెస్ కొట్టేనా చూడాలి.