పెద్దాయ‌నికి సీనియ‌ర్ జూనియ‌ర్ అనే తేడా తెలీదు!

ఎంతో మంది స్టార్ హీరోలగా తీర్చిదిద్దిన ఘ‌న‌త ఆయ‌న‌కు ద‌క్కుతుంది.

Update: 2024-07-31 00:30 GMT

సీనియ‌ర్ లెజెండ‌రీ డైరెక్ట‌ర్ కోదండ‌రామిరెడ్డి చిత్రాల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఇండ‌స్ట్రీకి ఎన్నో హిట్ చిత్రాలు అందించిన ఘ‌న‌త ఆయ‌న‌సొంతం. 1980 లో `సంధ్య‌` అనే సినిమాతో ఆయ‌న ప్ర‌స్తానం మొద‌లు పెట్టి `పున్న‌మి నాగు` వ‌ర‌కూ దిగ్విజ‌యంగా సాగింది. మూడు ద‌శాబ్ధాల పాటు తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు విశేష సేవ‌లందించారు. ఎంతో మంది స్టార్ హీరోలగా తీర్చిదిద్దిన ఘ‌న‌త ఆయ‌న‌కు ద‌క్కుతుంది.

రాఘవేంద్రరావు - దాసరి నారాయణ రావు తరువాత ఇండ‌స్ట్రీలో గ్రేట్ డైరెక్ట‌ర్ల‌లో ఆయ‌న పేరు వినిపిస్తుంది. తాజాగా కోదండ‌రామి రెడ్డి సినీ ప్రస్థానం గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు.` నేను హీరోను కావాలనే ఆశతో ఇండస్ట్రీకి వచ్చిను. తొలుత‌ అసిస్టెంట్ డైరెక్టర్ గా అడుగుపెట్టాను. వి. మధుసూదనరావు, రాఘవేంద్రరావు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాను. రాఘవేంద్రరావు గారు రామారావుగారితో `సింహబలుడు` చేస్తున్నప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నాను.

నేను రామారావు గారిని చూడటం అదే మొదటిసారి. ఆయనను చూస్తేనే నాకు భయం వేసేది. అలాంటి ఆయనను డైరెక్ట్ చేసే ఛాన్స్ అంత తొందరగా వస్తుందనుకోలేదు. ఒక రోజు రామారావుగారు .. వాణిశ్రీ గారు సెట్ కి వచ్చారు. సీన్ ఏంట‌ని రామారావుగారు అడిగితే చెప్పాను. అప్పుడు ఆయన `డైరెక్టర్ గారు ఎక్క‌డ? అని అడిగారు. ఆయన వేరే యూనిట్ చేస్తున్నారనీ చెప్పాను. మరి ఇక్కడ ఎవ‌రు చేస్తార‌న్నారు? నన్ను చేయమన్నారు సార్' అన్నాను.

ఓకే దట్స్ ఆల్ రైట్ .. కమాన్' అన్నారాయన. నిజానికి నువ్వు నన్ను డైరెక్ట్ చేయడమేంటి? అనాలాయన. కానీ ఏం చేయాలో చెప్పండని ఆయన అనగానే నా కళ్లలో ఒక్క‌సారిగా నీళ్లు తిరిగాయి. నిజంగా అది ఆయన గొప్పతనం. ప‌ని విష‌యంలో ఆయ‌న‌కి సీనియ‌ర్..జూనియ‌ర్ ..అసిస్టెంట్ అనే బేధం ఉండ‌దు. అంద‌ర్నీ ఎంతో గౌర‌విస్తారు` అని అన్నారు.

Tags:    

Similar News