మేకప్ రూమ్‌లో బంధించి నిర్మాత వేధించాడు!

టెలివిజన్ నటి కృష్ణ ముఖర్జీ తన 'శుభ్ షగున్' షో నిర్మాత వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు

Update: 2024-04-27 12:49 GMT

టెలివిజన్ నటి కృష్ణ ముఖర్జీ తన 'శుభ్ షగున్' షో నిర్మాత వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. యే హై మొహబ్బతీన్ లో తన పాత్రతో పాపుల‌రైన కృష్ణ ముఖ‌ర్జీ.. టీవీ రంగంలో కెరీర్ ప‌రంగా బిజీగా ఉన్నారు. స‌ద‌రు న‌టీమ‌ణి తన ఇన్‌స్టాగ్రామ్ లో షో మేకర్స్‌పై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ సుదీర్ఘమైన నోట్‌ను రాసింది.

డిప్రెషన్‌తో పోరాడాన‌ని .. తన ఆందోళనకు 'శుభ్ షగున్' నిర్మాతలే కార‌ణ‌మ‌ని కృష్ణ‌ ఆరోపించారు. సెట్లో తాను 'కఠినమైన సమయాలను' ఎదుర్కొంటున్నానని, నిర్మాత వేధించార‌ని ఆరోపించారు. ''నా గుండెల్లో ఉన్న విష‌యాన్ని బయటకు చెప్పే ధైర్యం నాకు ఎప్పుడూ లేదు.. కానీ ఈ రోజు ఆగేది లేద‌ని నిర్ణయించుకున్నాను. నేను కఠినమైన స‌మ‌యాన్ని ఎదుర్కొంటున్నాను. గత ఒకటిన్నర సంవత్సరాలు నాకు అంత సులభం కాదు. నేను ఒంటరిగా ఉన్నప్పుడు నిస్పృహకు లోనయ్యాను.. ఆత్రుతగా ఉండి గుండెలవిసేలా ఏడ్చాను. నేను దంగల్ టీవీ కోసం నా చివరి షో 'శుభ్ షగున్' చేయడం ప్రారంభించినప్పుడు ఇదంతా ప్రారంభమైంది. అది నా జీవితంలో అత్యంత చెత్త నిర్ణయం. నేనెప్పుడూ అలా చేయాలనుకోలేదు.. కానీ ఇతరుల మాటలు విని ఒప్పందంపై సంతకం చేశాను. ప్రొడక్షన్ హౌస్.. నిర్మాత కుంద‌న్ సింగ్ నన్ను చాలా సార్లు వేధించారు'' అని రాసింది.

కృష్ణ ముఖ‌ర్జీ (31) తాను అనారోగ్యంతో ఉన్నప్పుడు.. షూటింగ్ చేయడానికి ఇష్టపడనప్పుడు త‌న‌ను మేకప్ రూమ్‌లో బంధించారని పేర్కొంది. తనకు రావాల్సిన‌ బకాయిలను క్లియర్ చేయలేదని కూడా ఆరోపించింది. ప్రొడక్షన్ హౌస్ తనకు ఇంకా పెద్ద మొత్తం ఇవ్వాల్సి ఉన్నా చెల్లించలేదని ఆరోపించింది. ''వారు ఒకసారి నన్ను నా మేకప్ రూమ్‌లో లాక్ చేసారు.. నేను అస్వస్థతతో ఉన్నాను.. నేను బెజ్ షూట్ చేయకూడదని నిర్ణయించుకున్నాను. వారు నా పనికి నాకు జీతం ఇవ్వడం లేదు.. ఒక‌సారి వారు నా మేకప్ గది తలుపును పగలగొట్టారు.. ఆ స‌మ‌యంలో నేను నా బట్టలు మార్చుకుంటున్నాను. వారు 5 నెలలుగా నాకు రావాల్సిన వేత‌న‌ చెల్లింపులను క్లియర్ చేయలేదు. పెద్ద మొత్తం నాకు ఇవ్వాల్సి ఉంది. నేను ప్రొడక్షన్‌ హౌస్‌కి, దంగల్‌ ఆఫీస్‌కి వెళ్లాను కానీ అక్క‌డ న‌న్ను ఎప్పుడూ ప‌ట్టించుకోలేదు. చాలా సార్లు ధమ్కీ కూడా ఇచ్చారు'' అని ఆవేద‌న చెందింది.

తాను అసురక్షితంగా ఉన్నాన‌ని ..భయపడ్డానని కూడా స‌ద‌రు న‌టీమ‌ణి అన్నారు. నేను చాలా మంది వ్యక్తుల సహాయం అడిగాను కానీ ఎవ‌రూ చేయ‌లేదు. ఎవరూ ఏమీ చేయలేకపోయారు. నేను ఎందుకు ఏ ఇత‌ర‌ షో చేయడం లేదని ప్రజలు నన్ను అడుగుతారు. దానికి ఇదీ కారణం. మళ్ళీ అదే జరిగితే నాకు భయంగా ఉంది ?? నాకు న్యాయం కావాలి..'' అని సుదీర్ఘంగా ఇన్ స్టా లేఖ‌లో రాసారు.

Tags:    

Similar News