L2E: తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఎలా ఉన్నాయంటే..

ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుండి సాలీడ్ రెస్పాన్స్ వచ్చింది.;

Update: 2025-03-24 13:40 GMT
L2 Empuraan in telugu states

మలయాళ మెగాస్టార్ మోహన్‌లాల్ నటిస్తున్న లేటెస్ట్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ 'ఎల్2: ఎంపురాన్' మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం లూసిఫర్‌కు కొనసాగింపుగా వస్తుండటంతో, దానికి మించి మాస్ యాక్షన్, రాజకీయ డ్రామాతో ఆకట్టుకుంటుందనే హైప్ ఉంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుండి సాలీడ్ రెస్పాన్స్ వచ్చింది.

ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతుండటంతో దానికి సంబంధించి అన్ని భాషల్లోనూ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. మలయాళం లో అయితే ఇప్పటికే ప్రీ సెల్స్ తో నెంబర్ వన్ రికార్డ్ లను బ్రేక్ చేసింది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాపై మంచి స్పందన కనిపిస్తోంది. ‘లూసిఫర్’ ఓటిటీలో చూసిన ప్రేక్షకులు ఇప్పుడు ఈ మూవీని థియేటర్లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి ఎదురుచూస్తున్నారు. అంతేకాదు, డైరెక్టర్ పృథ్వీరాజ్ నటుడిగా కూడా కీలక పాత్రలో ఉండటంతో సినిమాపై మల్టీ లెవెల్ అంచనాలు ఉన్నాయి.

లేటెస్ట్ సమాచారం ప్రకారం, తెలుగు రాష్ట్రాల్లో ‘ఎల్2: ఎంపురాన్’ కోసం ఇప్పటివరకు రూ.50 లక్షల అడ్వాన్స్ బుకింగ్స్ పూర్తయ్యాయి. దిల్ రాజు ఈ చిత్రాన్ని తెలుగులో గ్రాండ్ గానే విడుదల చేస్తున్నారు. ఒక మలయాళ సినిమాకు తెలుగులో ఈ స్థాయిలో బుకింగ్స్ రావడం విశేషం. ఇది బిగ్ బజ్ అని చెప్పొచ్చు. మల్టీప్లెక్స్ థియేటర్లలో మలయాళ వెర్షన్‌కు కూడా మంచి స్క్రీన్ కౌంట్ ఇచ్చారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఇలా అద్భుతమైన బుకింగ్స్ రావడం ఒకటైతే, సినిమా కంటెంట్ పై ఉన్న నమ్మకమే రెండవది. ఇప్పటికే మోహన్‌లాల్ గత సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అంతగా క్లిక్ కాలేదు. అయినప్పటికీ ప్రేక్షకులు కూడా ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమాపై ఆసక్తి చూపిస్తున్నారు. ఇది కేవలం స్టార్ పవర్ వల్ల కాదు, పృథ్వీరాజ్ కథనతనం, విజన్ కారణంగానే సాధ్యమవుతోంది.

ప్రేక్షకుల్లో ఈ సినిమాపై స్ట్రాంగ్ క్యూరియాసిటీ ఉందని అర్ధమవుతుంది. మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతున్న ఈ సినిమా మొదటి రోజే మంచి వసూళ్లు సాధించబోతుందనే అంచనాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మరి ‘ఎల్2: ఎంపురాన్’ ఎలాంటి చరిత్ర సృష్టించనుందో వేచి చూడాలి.

Tags:    

Similar News