సీనియర్ భామలిద్దరు చానాళ్లకు!
అలాగే వెటరన్ నటి సిమ్రన్ కూడా సెకెండ్ ఇన్నింగ్స్ లో ఇతర భాషల్లోనూ సినిమాలు చేస్తున్నారు.
ఒకప్పటి అందమైన హీరోయిన్ లైలా తెలుగు తెరపై కనిపించింది చాలా కాలమవుతుంది. రెండు దశాబ్ధాల క్రితం `శైలజా కృష్ణమూర్తి` సినిమాతో అలరించారు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. కానీ ఆ తర్వాత మళ్లీ తెలుగు సినిమాల్లో నటించలేదు. అవకాశాలు రాక నటించలేదా? వచ్చినా వద్దనుకున్నారా? అన్నది తెలియదుగానీ అప్పటి నుంచి తమిళ, కన్నడ భాషల్లోనూ కొనసాగుతున్నారు.సెకెండ్ ఇన్నింగ్స్ ని పూర్తిగా ఆ రెండు భాషలకే పరిమితం చేసారు.
అలాగే వెటరన్ నటి సిమ్రన్ కూడా సెకెండ్ ఇన్నింగ్స్ లో ఇతర భాషల్లోనూ సినిమాలు చేస్తున్నారు. టీవీ సీరియల్స్ లోనూ కొనసాగుతున్నారు. కానీ తెలుగు తెరపై మాత్రం కనిపించలేదు. తాజాగా లైలా-సిమ్రన్ కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ఇద్దరు ఒకే ప్రేమ్ లో తెలుగు ప్రేక్షకుల్ని అలరించనున్నారు. వివరాల్లోకి వెళ్తే...
ఆది పినిశెట్టి హీరోగా అరివళగన్ దర్శకత్వం శబ్దం అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా పై భారీ అంచనా లున్నాయి. అందుకు ఓ కారణం ఉంది. గతంలో ఇద్దరి కాంబినేషన్ లో రిలీజ్ అయిన `వైశాలి` తమిళ్ సహా తెలుగులో పెద్ద విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో `శబ్దం` చిత్రాన్ని తమిళ్ తో పాటు తెలుగులోనూ తెరకెక్కిస్తున్నారు. ఇందులో లైలా, సిమ్రాన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
హీరోయిన్ గా లక్ష్మీ మానన్ నటిస్తోంది. ఈ సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతుంది. రెండు కోట్ల రూపాయలతో 120 ఏళ్ల క్రితం నాటి గ్రంధాలయాల సెట్ వేస్తున్నారు. ప్రత్యేకమైన సౌండ్ ఎఫెక్స్ట్ ప్రేక్షకులకు కొత్త ఫీల్ ని అందించనున్నాయి. దీనికి సంబంధించి థమన్ హంగేరీ వెళ్లి మరీ ప్రత్యేకమైన ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ఇలాంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ లో సీనియర్ భామలిద్దరు యాడ్ అవ్వడం అన్నది కలిసొచ్చే అంశం.