భ‌ర్త‌పై లావ‌ణ్య ప్రేమ ఇలా ఓపెన్!

ఈ నేప‌థ్యంలో తాజాగా లావ‌ణ్య త్రిపాఠి తొలిసారి ఇన్ స్టా ద్వారా అభిమానుల‌కు ట‌చ్ లోకి వ‌చ్చారు.

Update: 2023-11-19 02:03 GMT

వ‌రుణ్ తేజ్-లావ‌ణ్య త్రిపాఠి వివాహ బంధంతో ఒక‌టైన సంగ‌తి తెలిసిందే. పెళ్లై అప్పుడే 18 రోజులు గ‌డిచిపోయింది. దాదాపు రెండు నెల‌లుగా పెళ్లి హ‌డావుడిలో ప‌డిన జోడీకి ఏమాత్రం తీరిక లేదు. దీంతో సోష‌ల్ మీడియా వాళ్లిద్ద‌రి ఫోటోలు త‌ప్ప ఇంకే విష‌యాలు బ‌య‌ట‌కు రాలేదు. ఈ నేప‌థ్యంలో తాజాగా లావ‌ణ్య త్రిపాఠి తొలిసారి ఇన్ స్టా ద్వారా అభిమానుల‌కు ట‌చ్ లోకి వ‌చ్చారు.

వ‌స్తూనే భ‌ర్త వ‌రుణ్ తేజ్ పై ఇన్నాళ్లు మ‌న‌సులో దాచుకున్న ప్రేమ‌ని వ్య‌క్తం చేసారు. `నా భ‌ర్త జాలి..కేరింగ్ ఎంతో బాగుంది. ఎంతో అద్భుత‌మైన మ‌నిషి. ఇంకా ఆయ‌న గురించి చెప్ప‌డానికి చాలా విష‌యాలే ఉన్నాయి. కానీ వాటిని నా మ‌న‌సులోనే ప‌దిలంగా దాచుకుంటాను. మూడు రోజుల పెళ్లి ఎంతో వైభ‌వంగా జ‌రిగింది. నాకు ఇదంతా ఓ క‌ల‌లా అనిపిస్తుంది. మ‌మ్మ‌ల్ని ఆశీర్వ‌దించి...శుభాకాంక్ష‌లు తెలియ‌జేసిన వాళ్లంద‌రికీ ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు` తెలిపారు.

అలాగే పెళ్లికి సంబంధించిన ఫోటోలు కొన్నింటిని షేర్ చేసారు. ఇంకా ప్ర‌త్యేకంగా డిజైన్ చేసిన లావ‌ణ్య పెళ్లి చీర‌పై వ‌రుణ్ ల‌వ్ అని రాసి ఉన్న ఫోటోని పంచుకున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. మెగా అభిమానులు లావ‌ణ్య‌ని వ‌దిన‌మ్మ అంటూ ఆప్యాయంగా పిల‌వ‌డం ప్రారంభించారు. ఇక ఈ జోడీ వెకేష‌న్ కి ఏదేశం వెళ్తారు? అన్న‌ది చూడాలి. అలాగే లావ‌ణ్య గురించి వ‌రుణ్ తేజ్ ఎలా స్పందిస్తాడో? చూడాలి.

లావ‌ణ్య ప్రేమ‌ని ఇంత కాలం దాచుకున్నానేడు కాస్త ఓపెన్ అయ్యారు. మ‌రి వ‌రుణ్ సిగ్గు ప‌క్క‌న‌బెట్టి ఓపెన్ అవుతాడా? అలాగే మెయింటెన్ చేస్తాడా? అన్న‌ది చూడాలి. అన్న‌ట్లు వ‌రుణ్ మ‌హా సిగ్గ‌రి. అందుకే పెద‌నాన్న చిరంజీవి వ‌రుణ్ ని అంత‌గా ఆట ప‌ట్టిస్తుంటారు.

Tags:    

Similar News