చనిపోతానంటూ లావణ్య సూసైడ్ నాట్

రాజ్ తరుణ్, లావణ్య వ్యవహారంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే క్యూరియాసిటీ సోషల్ మీడియాలో అందరికి పెరిగిపోయింది.

Update: 2024-07-13 05:32 GMT

రాజ్ తరుణ్, లావణ్య వ్యవహారంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే క్యూరియాసిటీ సోషల్ మీడియాలో అందరికి పెరిగిపోయింది. లావణ్య ఇచ్చిన ఫిర్యాదు, సమర్పించిన సాక్ష్యాల ఆధారంగా రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా మీద నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ చేశారు. అయితే కేసు ఫైల్ చేసిన ఇప్పటి వరకు రాజ్ తరుణ్ పై పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. రాజ్ తరుణ్ కూడా తనపై నమోదైన కేసుపైన ఇప్పటి వరకు బయటకొచ్చి రియాక్ట్ కాలేదు.

మరో వైపు రాజ్ తరుణ్ లావణ్యకి ఆమె తరపున వాదిస్తున్న లాయర్ కళ్యాణ్ దిలీప్ సుంకరకి డబ్బులు ఆఫర్ చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఎలా అయిన ఈ కేసుని లావణ్యతో వెనక్కి తీయించే ప్రయత్నం రాజ్ తరుణ్ చేస్తున్నట్లుగా లాయర్ కళ్యాణ్ దిలీప్ సుంకర ఆరోపిస్తున్నారు. భయపెట్టి బెదిరిస్తూ, పెద్దమొత్తంలో డబ్బులు ఆఫర్ చేస్తూ రాజ్ తరుణ్ తన లాయర్ ద్వారా సందేశాలు పంపిస్తున్నాడని కళ్యాణ్ దిలీప్ సుంకర ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

తనకి కొంతమంది సినీ నిర్మాతల నుంచి, బయటి నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని లావణ్య ఆరోపించింది. ఇదిలా ఉంటే ఈ వ్యవహారంలో సడెన్ ట్విస్ట్ చోటు చేసుకుంది. తాను చనిపోతున్నట్లు లావణ్య శుక్రవారం రాత్రి నార్సింగ్ పోలీసులకి సూసైడ్ లెటర్ ని పంపించింది. పోలీసులతో పాటు, మీడియాకి కూడా సూసైడ్ లెటర్ ని వాట్సాప్ ద్వారా లావణ్య పంపించింది.

దీంతో అలెర్ట్ అయిన పోలీసులు వెంటనే లావణ్య ఉంటున్న ఇంటికి వెళ్లారు. ఆమెకి కౌన్సిలింగ్ ఇచ్చి కాపాడారు. అయితే రాజ్ తరుణ్ లేని జీవితం నాకు అవసరం లేదని, మాల్వీ మల్హోత్రా కారణంగా రాజ్ తరుణ్ నన్ను దూరం పెట్టాడని, మోసం చేసి వెళ్లిపోయాడని లావణ్య ఆరోపించింది. అతను నా చావు కోరుకుంటున్నాడు. అందుకే చనిపోవాలని అనుకుంటున్నట్లు ఆమె సూసైడ్ లెటర్ లో రాసినట్లు తెలుస్తోంది. నా దగ్గర వాళ్ళు కూడా నన్ను అర్ధం చేసుకోవడం లేదని లావణ్య వాపోయింది.

లావణ్య సూసైడ్ చేసుకుంటానని చెప్పడంతో ఇప్పుడు ఈ వ్యవహారం మరింత సీరియస్ అయ్యింది. లావణ్యకి కౌన్సిలింగ్ ఇచ్చిన కూడా ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడుతుందో అనే టెన్షన్ లో పోలీసులు ఉన్నారు. చట్టపరంగా ఈ వ్యవహారంలో ఎలా ముందుకెళ్లాలి అనేది కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. రాజ్ తరుణ్ అయితే ఇంత వరకు లావణ్య ఆరోపణలు, తనపై నమోదైన కేసుపై మీడియా ముందుకొచ్చి వివరణ ఇచ్చే ప్రయత్నం చేయలేదు.

Tags:    

Similar News