విజయ్ 'లియో' హిందీ వెర్షన్ కష్టాలు

భాషా ప్రాతిపాదిక‌న వివిధ‌ ప్రాంతాల ప్రేక్షకులలో 'లియో'పై ఇప్ప‌టికే భారీ అంచ‌నాలున్నాయి. ముఖ్యంగా సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నందున ఈ చిత్రం హిందీ వెర్ష‌న్ బాగా రాణిస్తుందని భావిస్తున్నారు.

Update: 2023-09-23 02:30 GMT

ద‌ళ‌ప‌తి విజయ్ నటించిన 'లియో' ఈ సీజ‌న్ లో అతిపెద్ద విడుదలలలో ఒకటిగా ఉండబోతోంది. ఈ చిత్రం తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషలలో విడుదల కానుంది. త‌మిళ‌నాడు, తెలుగు రాష్ట్రాల్లో అంతా అనుకూలంగా ఉన్నా, 'లియో' హిందీ వెర్షన్‌కు ఇబ్బందులు ఎదురవుతున్నాయనేది తాజా సమాచారం.

భాషా ప్రాతిపాదిక‌న వివిధ‌ ప్రాంతాల ప్రేక్షకులలో 'లియో'పై ఇప్ప‌టికే భారీ అంచ‌నాలున్నాయి. ముఖ్యంగా సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నందున ఈ చిత్రం హిందీ వెర్ష‌న్ బాగా రాణిస్తుందని భావిస్తున్నారు. అయితే ఈ చిత్రం డిజిటల్ (ఓటీటీ) రిలీజ్ తేదీతో చిక్కులొచ్చి ప‌డుతున్నాయ‌ని చెబుతున్నారు.

'లియో' డిజిటల్ పార్టనర్ హిందీ వెర్షన్‌ను విడుదల చేసిన నెలలోపు తమ ప్లాట్‌ఫారమ్‌లో విడుదల చేయాలని ప్లాన్ చేయ‌డ‌మే దీనికి కార‌ణం. ఇది నేషనల్ మల్టీప్లెక్స్ చెయిన్‌లలో ఆందోళన కలిగించింది. నేషనల్ మల్టీప్లెక్స్ చైన్స్ అసోసియేషన్ ఈ నిర్ణయానికి వ్యతిరేకతను వ్యక్తం చేసింది. హిందీ చిత్రాలకు థియేటర్‌లలో విడుదల, OTT విడుదల మధ్య రెండు నెలల (8వారాల‌) గ్యాప్‌ని నిర్దేశించ‌గా సౌత్ సినిమాల‌కు ఇలాంటి నియ‌మం వ‌ర్తించ‌దా? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. దీంతో ప్ర‌తిష్ఠాత్మ‌క లియో హిందీ రిలీజ్ చిక్కుల్లో ప‌డింద‌ని చెబుతున్నారు.

అయితే 'లియో' హిందీ వెర్షన్‌ను సజావుగా విడుదల చేయాలనే డిజిటల్ (ఓటీటీ) భాగస్వామి తమ నిర్ణయాన్ని మార్చుకుంటారా లేదా హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో సినిమాకు సమస్య కొనసాగుతుందో వేచి చూడాల్సిన స‌న్నివేశం ఉంది. లియో అక్టోబర్ 19 న విడుదల కానుంది. ఈ చిత్రం పెద్ద స్క్రీన్‌లలోకి రావడానికి ఒక నెల కంటే తక్కువ సమయం ఉంది. ఇటీవ‌ల లియో మేకర్స్ గత కొన్ని రోజులుగా ఆయా భాషలలో ఈ చిత్రం పోస్టర్‌ల సెట్‌ను విడుదల చేసారు. ఈ చిత్రం హిందీ పోస్టర్‌లో సంజయ్ దత్‌పై విజయ్ తీవ్రంగా పోరాడుతున్న ఫోటోగ్రాఫ్ ఆస‌క్తిని క‌లిగించింది. లియో మేకర్స్ నుండి తదుపరి ప్రకటన రెండవ సింగిల్ లేదా ఆడియో లాంచ్ అవుతుంద‌ని భావిస్తున్నారు. సెప్టెంబర్ 30 న చెన్నైలో గ్రాండ్ ఆడియో ఈవెంట్ జరగనుంది.

Tags:    

Similar News