'లియో'తో నేష‌న‌ల్ మ‌ల్టీప్లెక్స్ కి ఫుల్ క్లారిటీ!

త‌ల‌ప‌తి విజ‌య్ క‌థానాయకుడిగా లోకేష్ క‌న‌గరాజ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న 'లియో' భారీ అంచ‌నా ల మధ్య పాన్ ఇండియాలో రిలీజ్ అవుతున్న సంగ‌తి తెలిసిందే

Update: 2023-09-22 05:30 GMT

త‌ల‌ప‌తి విజ‌య్ క‌థానాయకుడిగా లోకేష్ క‌న‌గరాజ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న 'లియో' భారీ అంచ‌నా ల మధ్య పాన్ ఇండియాలో రిలీజ్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. 'ఖైదీ'..'విక్ర‌మ్' త‌ర్వాత లొకేష్ యూనివ‌ర్శ్ నుంచి రిలీజ్ అవుతోన్న సినిమా కావ‌డంతో అంచ‌నాలు ఆకాశ‌న్నంటుతున్నాయి. 'లియో' లో విజ‌య్ ని ఎలా హైలైట్ చేయ‌బోతున్నాడు? ఎలాంటి క‌థ‌తో రాబోతున్నారు? అన్న ఎగ్జైట్ మెంట్ అభిమా నుల్లో క‌నిపిస్తోంది.

అక్టోబ‌ర్ 19 ఎప్పుడొస్తుందా? అని ఎదురుచూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో నేష‌న‌ల్ మ‌ల్టీప్లెక్స్ లియోకి షాక్ ఇచ్చేలా క‌నిపిస్తోంది. దీనికి కార‌ణం థియేట్రిక‌ల్ రిలీజ్ -ఓటీటీ డిజిటల్ రిలీజ్ మ‌ధ్య పెద్ద‌గా గ్యాప్ లేక‌పో వ‌డమే. మ‌ల్టీప్లెక్స్ తీసుకొచ్చిన ఎనిమిది వారాల నిబంధ‌న‌ను 'లియో' గాలికి వ‌దిలేయ‌డంతో సినిమా హిందీలో కేవ‌లం సింగిల్ స్క్రీన్ కే ప‌రిమిత‌మ‌య్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. మ‌ల్టీప్లెక్స్ లో వారం రోజుల పాటు జ‌రిగే బిజినెస్ కోసం లియో డిజిట‌ల్ మార్కెట్ ని వ‌దులుకోదు.

థియేట‌ర్ రిలీజ్ అనంత‌రం 'లియో' నెల రోజుల్లోనే ఓటీటీలో రిలీజ్ అవుతుంది. ఇక థియేట‌ర్ల ప‌రంగా భారీ ఓపెనింగ్స్ ద‌క్కుతాయ‌న‌డంలో సందేహం లేదు. ఇదే స్ట్రాట‌జీతో 'జైల‌ర్' రిలీజ్ అయింది. ఎనిమిది వారాల నిబంధ‌నికి జైల‌ర్ కూడా నో చెప్ప‌డంతో నేష‌న‌ల్ మ‌ల్టీప్లెక్స్ కి దూర‌మైంది. ఓటీటీ అనేది సినిమా కంప‌ర్ట్ బిజినెస్. సేఫ్ జోన్ దాటి ఏ నిర్మాత ముందుకు రాడు. కాబ‌ట్టి ఇది మ‌ల్టీప్లెక్స్ కే న‌ష్టం త‌ప్ప‌! నిర్మాత‌కు కాద‌ని బ‌లంగా వినిపిస్తోన్న మాట‌. ఓవైపు పైర‌సీ భూతం కూడా ఇండ‌స్ట్రీని ప‌ట్టి పీడిస్తుంది.

తొలి షో ప‌డ‌గానే ప్రింట్ లీక్ అవుతుంది. కొన్ని సినిమాల కంటెంట్ రిలీజ్ కంటే ముందే వెబ్ సైట్స్ లో ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. దీనిపై ఎన్ని క‌ఠిన ఆంక్ష‌లు తెచ్చినా ప‌న‌వ్వ‌డంలేదు. వెర‌సి తిరిగి బెదిరింపుల‌కే పాల్ప‌డుతున్నారు. ఇలాంటి స‌మ‌యంలో ఓటీటీలు కూడా ఎక్కువ గ్యాప్ తీసుకుని రిలీజ్ చేసే ప‌రిస్థితి లేదు. ఈ నేప‌థ్యంలో నేష‌న‌ల్ మ‌ల్టీప్లెక్స్ తీసుకొచ్చి 8 వారాల నిబంధ‌న సాధ్య‌మ‌వ్వ‌డం క‌ష్ట‌మ‌నే తెలుస్తోంది.

Tags:    

Similar News