హీరో.. సైడ్ హీరో తేడాలేంటి..?
ఒక సినిమా ఆడాలంటే మాత్రం హీరోనే ప్రధాన కారణమని అంటుంటారు. ముఖ్యంగా స్టార్ సినిమాల్లో ఫ్యాన్స్ అంతా కూడా హీరో కోసమే సినిమాలకు వెళ్తుంటారు.;
ఒక సినిమా ఆడాలంటే మాత్రం హీరోనే ప్రధాన కారణమని అంటుంటారు. ముఖ్యంగా స్టార్ సినిమాల్లో ఫ్యాన్స్ అంతా కూడా హీరో కోసమే సినిమాలకు వెళ్తుంటారు. ఐతే అలా కాకుండా కంటెంట్ బేస్డ్ సినిమాలు చేసే టైం లో ఈ కాలిక్యులేషన్స్ ఉండవు. కథ ప్రకారంగా ఇద్దరు లేదా ముగ్గురు కలిసి ఈమధ్య సినిమాలు చేస్తున్నారు. అలా ముగ్గురు ఉన్నా కూడా మెయిన్ లీడ్ ఎవరు పక్కన ఫ్రెండ్ అదే జోకర్ పాత్ర ఎవరన్నది చర్చిస్తారు.
ముగ్గురు కుర్రాళ్లతో తీసే కథల్లో ఈమధ్య ముగ్గురికీ సమాన పాత్రలు ఇస్తూ వస్తున్నారు. అలా రెండేళ్ల క్రితం వచ్చిన మ్యాడ్ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఎన్టీఆర్ బామ్మరిది నార్నె నితిన్ తొలి సినిమా కాగా రామ్ నితిన్, సంగీత్ శోభన్ లు ప్రధాన పాత్రలుగా నటించారు. కళ్యాణ్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన మ్యాడ్ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో పాటు ఆ ముగ్గురి పాత్రలకు మంచి క్రేజ్ ఏర్పడింది.
ఇక ఆ క్రేజ్ తోనే మ్యాడ్ స్క్వేర్ అనే సినిమా చేస్తున్నారు. నెక్స్ట్ వీక్ అది రిలీజ్ అవుతుంది. మ్యాడ్ సినిమాలో నార్నె నితిన్ తో పాటుగా డీడీ పాత్రకు మంచి క్రేజ్ వచ్చింది. సినిమాలో అతని టైమింగ్, కామెడీ అదిరిపోయింది. నిజం చెప్పాలంటే మ్యాడ్ సినిమాను నిలబెట్టింది అతనే అన్నట్టుగా ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ లో కూడా సంగీత్ శోభన్ పాత్ర బాగా ఉంటుందని అనిపిస్తుంది.
ఐతే ఈమధ్య సినిమా ప్రమోషనల్ పోస్టర్స్ లో సంగీత్ శోభన్ ని పక్కన పెట్టినట్టు కనిపిస్తుంది. అంటే నార్నె నితిన్ ని మెయిన్ లీడ్ గా ప్రమోట్ చేస్తూ పోస్టర్స్ వదిలారు. ఐతే దానికి సంగీత్ శోభన్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. సోషల్ మీడియాలో సంగీత్ ఫ్యాన్స్ ఎటాక్ చేశారు. ఆ తాకిడి నిర్మాణ సంస్థ దాకా వెళ్లడంతో లేటెస్ట్ పోస్టర్స్ లో సంగీత్ ని మిడిల్ లో ఉంచి పోస్టర్స్ రిలీజ్ చేశారు.
యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతున్న మ్యాడ్ స్క్వేర్ సినిమా ప్రేక్షకులను మెప్పించేలా రాబోతుంది. ఈ సినిమాను మార్చి 29న రిలీజ్ ప్లాన్ చేశారు. ఐతే సినిమాకు పెయిడ్ ప్రీమియర్స్ వేస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. మార్చి 27న మోహన్ లాల్ లూసిఫర్ 2, విక్రం వీర ధీర శూర వస్తుండగా మార్చి 28న రాబిన్ హుడ్ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ పోటీలో మ్యాడ్ స్క్వేర్ ఏ రేంజ్ లో ప్రేక్షకులను అలరిస్తుంది అన్నది చూడాలి.