బాబోయ్ కియారా... ఆలియా కంటే ఎక్కువ!
బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ హిందీ సినిమాలతో పాటు వరుసగా సౌత్ సినిమాలను చేస్తుంది.;

సౌత్ హీరోయిన్స్ పారితోషికంతో పోల్చితే నార్త్ హీరోయిన్స్ ముఖ్యంగా బాలీవుడ్ సినిమాల హీరోయిన్స్ పారితోషికం చాలా ఎక్కువగా ఉంటుంది. గత దశాబ్ద కాలంగా బాలీవుడ్ హీరోయిన్స్ పారితోషికం భారీగా పెరుగుతూనే వస్తోంది. సౌత్‌లో హీరోల పారితోషికం వందల కోట్లు ఉంటుంది. కానీ హీరోయిన్స్ పారితోషికం రూ.5 కోట్లు ఉంటే చాలా పెద్ద విషయం అన్నట్లు ఉండేది. కానీ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో ఉత్తరాది ముద్దుగుమ్మలు నటిస్తున్న కారణంగా వారికి భారీ పారితోషికం ఇవ్వాల్సి వస్తుంది. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో ఆలియా భట్ చిన్న పాత్రలో నటించినప్పటికీ ఏకంగా రూ.9 కోట్ల పారితోషికంతో పాటు, ఇతర అలవెన్స్‌లు అన్ని కలిపి మరో కోటి రూపాయలు ఇచ్చారని టాక్. ఇప్పటి వరకు సౌత్‌లో ఆలియా పారితోషికం గురించి చర్చ జరుగుతూ ఉండేది. ఇక మీదట కియారా అద్వానీ పారితోషికం గురించి చర్చ జరగనుంది.
బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ హిందీ సినిమాలతో పాటు వరుసగా సౌత్ సినిమాలను చేస్తుంది. ఇటీవల రామ్ చరణ్‌తో కలిసి శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ ఛేంజర్ సినిమాతో కియారా అద్వానీ వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. గేమ్ ఛేంజర్ సినిమాలో నటించేందుకు గాను కియారా అద్వానీ దాదాపుగా రూ.5 కోట్ల పారితోషికం తీసుకుంది అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్. అంతకు ముందు టాలీవుడ్‌లో కియారా అద్వానీ భరత్ అనే నేను, వినయ విధేయ రామ సినిమాల్లో నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమాలకు భారీ పారితోషికం అందుకుంది. ఇప్పుడు కన్నడ మూవీ టాక్సిక్‌లో యశ్‌కి జోడీగా నటిస్తుంది.
గోవా డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో పాన్ వరల్డ్ మూవీగా రూపొందుతున్న యశ్ 'టాక్సిక్' మూవీలో కియారా అద్వానీ నటిస్తోంది. గీతు మోహన్ దాస్ దర్శకత్వంలో కేవిన్ ప్రొడక్షన్స్‌తో కలిసి యశ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నటిస్తున్నందుకు గాను కియారా అద్వానీ ఏకంగా రూ.15 కోట్ల పారితోషికం అందుకుంటున్నట్లు సమాచారం అందుతోంది. సౌత్ సినిమాల్లో నటించిన హీరోయిన్ ఈ స్థాయి పారితోషికం అందుకోవడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. టాక్సిక్ సినిమాలో కియారా అద్వానీ పాత్రకు ఉన్న ప్రాముఖ్యతతో పాటు, ఆమె ఎక్కువ డేట్లు ఇవ్వాల్సి ఉన్న కారణంగా నిర్మాతలు ఆ స్థాయి పారితోషికం ఇచ్చేందుకు ఓకే చెప్పి ఉంటారు అనేది కన్నడ సినీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. ఇటీవల కన్నడ మీడియా వర్గాల్లో కియారా అద్వానీ రెమ్యూనరేషన్ గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది.
టాక్సిక్ సినిమాతో పాటు కియారా అద్వానీ బాలీవుడ్ 'వార్ 2' సినిమాలోనూ నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ ఏడాదిలోనే ఈ రెండు భారీ చిత్రాలతో కియారా అద్వానీ రాబోతుంది. గత ఏడాదిలో కియారా అద్వానీ గర్భవతి కావడంతో కొన్ని నెలల పాటు విశ్రాంతి తీసుకుంది. గత నెలలో కియారా అద్వానీ తన మొదటి బేబీకి జన్మనిచ్చింది. అతి త్వరలోనే కియారా అద్వానీ కెమెరా ముందుకు రానుంది. ఇప్పటికే కమిట్ అయి మధ్యలో ఉన్న సినిమాల షూటింగ్‌ను పూర్తి చేయడం కోసం ఏప్రిల్ లేదా మే నెలలో షూటింగ్స్‌కు హాజరు అయ్యేందుకు కియారా అద్వానీ నిర్మాతలకు ఓకే చెప్పిందని సమాచారం అందుతోంది. టాక్సిక్ సినిమా షూటింగ్‌లో కియారా అద్వానీ పాల్గొనాల్సి ఉంది. త్వరలోనే ఆమె కాంబో సీన్స్‌ను చిత్రీకరించేందుకు గాను దర్శకురాలు గీతూ మోహన్ దాస్ వెయిట్ చేస్తున్నారు. టాక్సిక్ సినిమా హిట్ అయితే కియారా అద్వానీ పారితోషికం మరింత పెరిగిన ఆశ్చర్యం లేదు.