బ్లాస్ట్ అయిన ఎస్.కె 23..ఎలివేషన్ ఓ రేంజ్ లో!
కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్ ఇటీవలే `అమరన్` తో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే.
కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్ ఇటీవలే `అమరన్` తో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. శివ కార్తికేయన్ కెరీర్ లో భారీ వసూళ్లు సాధించిన తొలి చిత్రమిది. తమిళ్ తో పాటు తెలుగులోనూ మంచి వసూళ్లను సాధించింది. ప్రస్తుతం శివకార్తికేయన్ 23వ చిత్రం క్రియేటివ్ డైరెక్టర్ మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఆన్ సెట్స్ లో ఉందీ చిత్రం. ఈసినిమాకి మురగదాస్ ఎలాంటి టైటిల్ పెడతాడని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ నేపథ్యంలో వాళ్ల అంచనాలు సంచలనాలు అయ్యేలా `మదరాసి` అనే క్రేజీ టైటిల్ ని ప్రకటించారు. టైటిల్ గ్లింప్స్ ని రిలీజ్ చేసారు. గ్లింప్స్ లో పవర్ పుల్ యాక్షన్ ఎపిసోడ్ తో నింపేసారు. కార్ చేజింగ్ సన్నివేశాలు...బ్లాస్టింగ్స్ సీన్స్ తో గ్లింప్స్ అదిరిపోయింది. బాంబుల మోతలు, తుపాకీ గుళ్ల వర్షంతో ఎస్ ..కె 23 హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్ టైనర్ అని తెలుస్తుంది. శివ కార్తికేయన్ ఎలివేషన్ ఓ రేంజ్ లో ఉంది.
`గజినీ`లో సూర్య తరహాలోనే శివ కార్తికేయన్ రోల్ ని డిజైన్ చేసినట్లు కనిపిస్తుంది. డార్క్ సన్నివేశం ఆకట్టుకుంటుంది. అనిరుద్ బీజీఎమ్ తో మరోసారి హైలైట్ అవుతుంది. ప్రస్తుతం గ్లింప్స్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగు తున్నాయి. భారీ యాక్షన్ సన్నివేశాలు ఉండటంతో విజువల్ ఎఫెక్స్ట్ ప్రాధాన్యత కనిపిస్తుంది.
పాన్ ఇండియాలో ఈ చిత్రం వేసవిలో రిలీజ్ అవుతుంది. శ్రీలక్ష్మీ మూవీస్ బ్యానర్ పై సుందర్ రాజా నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో పాటు, మురగదాస్ బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ హీరోగా `సికిందర్` చిత్రాన్ని కూడా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా ముగింపు దశకు చేరుకుంది.