పుష్ప 2పై బాలీవుడ్ డైరెక్టర్ ఎలివేషన్స్.. వైల్డ్‌ఫైర్‌ అంటూ..

ఇక ఈ సినిమాపై ప్రముఖ బాలీవుడ్ మేకర్స్ సైతం పాజిటివ్ గా స్పందిస్తున్నారు. బాలీవుడ్ సీనియర్ దర్శకుడు మధుర్ బండార్కర్ పుష్ప 2 చూసి తన అనుభూతుల్ని పంచుకున్నారు.

Update: 2024-12-07 11:20 GMT

ఏక్కడ చూసినా పుష్ప రాజ్ మ్యానియా ఒక రేంజ్ లో వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప: ది రూల్ బాక్సాఫీస్ వద్ద దండయాత్ర కొనసాగిస్తోంది. ఇక ఐకాన్ అల్లు అర్జున్ స్టామినా ఏమిటో మరోసారి క్లారిటీగా అర్ధమవుతుంది. ఇక ఈ సినిమాపై ప్రముఖ బాలీవుడ్ మేకర్స్ సైతం పాజిటివ్ గా స్పందిస్తున్నారు. బాలీవుడ్ సీనియర్ దర్శకుడు మధుర్ బండార్కర్ పుష్ప 2 చూసి తన అనుభూతుల్ని పంచుకున్నారు.

ఈ సినిమాని చూసి షాక్ అయ్యానని సోషల్ మీడియాలో ఈ విధంగా తెలిపారు. ఇది భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఒక గేమ్ చేంజర్‌గా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. అల్లు అర్జున్ నటన గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, జాతర సీన్‌లో అతని హావభావాలు, స్వాగ్ ప్రతి ఒక్కరిని మైమరిపించిందని అన్నారు. ఈ పాత్రకు నేషనల్ అవార్డ్ ఇవ్వాల్సిందేనని పేర్కొన్నారు.

అలాగే, ఫహద్ ఫాసిల్ తన ప్రతిభను మరోసారి నిరూపించుకున్నాడని ప్రశంసించారు. అతని నటన, స్క్రీన్ ప్రెజెన్స్ ముద్ర వేశారు. రష్మిక మందన్న చార్మింగ్ ప్రదర్శనతో అందరిని ఆకట్టుకున్నారని అన్నారు. ఈ సినిమాలో ఆమె పాత్ర మొత్తం చిత్రానికి ఎలివేషన్ ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు సుకుమార్ గురించి కూడా మధుర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు.

అద్భుతమైన స్క్రీన్‌ప్లే, పవర్ఫుల్ డైలాగ్స్, కంటెంట్ ఉన్న కథతో ప్రేక్షకులను మొదటి సీన్ నుంచి చివరి వరకు కట్టిపడేశారని అన్నారు. పుష్ప 2 ఒక డ్రామా, ఎంటర్‌టైన్‌మెంట్ కలబోతగా నిలిచిందని, ఇది తప్పక చూడాల్సిన సినిమా అని అభివర్ణించారు. సినిమా యాక్షన్ సీక్వెన్స్‌లు అద్భుతంగా ఉన్నాయని, వాటిని చూసి ప్రేక్షకులు సీట్లకు గట్టిగా పట్టుకుపోయేలా అయ్యారని అన్నారు.

బాక్సాఫీస్ దగ్గర పుష్ప 2 ఒక వైల్డ్‌ఫైర్‌లా రన్ అవుతుందని తెలిపారు. అల్లు అర్జున్ ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. జాతర సీన్ లో అతని హావభావాలకు ఎవరైనా సరే ప్రశంసలు అందించాల్సిందేనని అన్నారు. ఈ వ్యాఖ్యలతో పాటు, మధుర్ బండార్కర్ సినిమా పోస్టర్ ముందు దిగిన ఫోటోని కూడా పంచుకున్నారు. పుష్ప 2 చూసిన ప్రతి ఒక్కరూ ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వ్యాఖ్యలతో ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.

Tags:    

Similar News