మాధురి దీక్షిత్ అలా చేస్తే దేశం వీడాల్సిందే!
అయితే ఈ కంపెనీ తరుపున ప్రచారం చేయడానికి మాధురీ దీక్షిత్ హాజరవుతుంది.
బాలీవుడ్ సీనియర్ నటి వివాదంలో ఇరుక్కుంది. ఓ కంపెనీకి చెందిన యాడ్ విషయంలో మాధురి తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. పాకిస్తాన్ సంతతికి చెందిన అమెరికన్ వ్యాపార వేత్త రెహన్ సిద్దిఖీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకునే క్రమంలో ఓ భారీ ఈవెంట్ ప్లాన్ చేసాడు. ఆగస్టు నెలలో తన కంపెనీ ప్రమోషన్ లో భాగంగా టెక్సాస్ లో ఈవెంట్ చేస్తున్నాడు. అయితే ఈ కంపెనీ తరుపున ప్రచారం చేయడానికి మాధురీ దీక్షిత్ హాజరవుతుంది.
అందకు భారతీయుల నుంచి మాధురీ దీక్షిత్ విమర్శలు ఎదుర్కుంటుంది. ఓ తప్పుడు కంపెనీకి, తప్పుడు వ్యక్తికి మాధురి దీక్షిత్ సహకరిస్తుందని నెట్టింట మండిపడుతున్నారు. దీనికి కారణం లేకపోలేదు. పాకిస్తాన్ గుఢచారి సంస్థ ఐఎస్ తో రెహన్ సిద్దీఖి సంబంధాలున్నట్లు ఆరోపణలున్నాయి. ఆయన కంపెనీలు అన్నింటినీ భారత్ బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. అలాంటి వ్యక్తికి మాధురీ దీక్షిత్ ప్రచారం కోసం టెక్సాక్ వెళ్లడం ఏంటి? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఉగ్ర మూకలతో సంబంధం ఉన్న వారితో మాధురి పనిచేయడం? ఏంటి విమర్శలు గుప్పిస్తున్నారు. తక్షణం ఆమె నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని లేదంటే? భారత్ లో ఆమె ని బ్యాన్ చేయాలంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి భేషజాలం లేకుండా పాల్గొంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. తక్షణం ఆమె కూడా భారత్ విడిచి వెళ్లిపోవాల్సి ఉంటుందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
మరి దీని గురించి మాధురీ దీక్షిత్ రియాక్షన్ ఎలా ఉంటుదన్నది చూడాలి. సెలబ్రిటీలపై ఇలాంటి వ్యతిరకేత వస్తే కెరీర్ పరంగా ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. గతంలో అమీర్ ఖాన్ పాకిస్తాన్ కి మద్దతుగా చేసిన వ్యాఖ్యలకు దేశ వ్యాప్తంగా ఎంతటి దుమారాన్ని రేపాయో తెలిసిందే. ఆ దెబ్బకి అమీర్ ఇప్పటికీ కోలుకోలేకపోయాడు. షారుక్ ఖాన్ మరికొంత మంది ఖాన్ లు సైతం అక్షింతలు వేయించుకున్న సందర్భాలున్నాయి.