ఇదేం షూటింగ్ కాదు..హీరోపై హైకోర్టు సీరియ‌స్!

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ కొన్ని నెల‌లుగా వివాదాల‌తో అంట‌గాగుతోన్న సంగ‌తి తెలిసిందే.

Update: 2024-08-02 08:06 GMT

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ కొన్ని నెల‌లుగా వివాదాల‌తో అంట‌గాగుతోన్న సంగ‌తి తెలిసిందే. ఓ కేసు విష‌యంలో మ‌ద్రాస్ హైకోర్టు కూడా సీరియ‌స్ అయింది. కోర్టు ఆదేశాలు ధిక్కరించినందుకు విశాల్ పై కేసు నమోదు చేయాల్సి వస్తుందని హెచ్చరించింది. న్యాయస్థానం ముందు అందరూ సమానమే అని.. తమకు తాము ఉన్నతంగా భావించవద్దని తెలిపింది.

తాజాగా మ‌రోసారి అదే మ‌ద్రాస్ హైకోర్టు న్యాయ‌మూర్తి విశాల్ పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. లైకా ప్రొడ‌క్ష‌న్ సంస్థ కేసు విచార‌ణ‌లో భాగంగా విశాల్ హైకోర్టుకు హాజ‌ర‌య్యారు. తాను కేవ‌లం తెల్ల కాగితం మీద‌నే సంత‌కంచేసాన‌ని, లైకా సంస్థ‌తో అగ్రిమెంట్ జ‌రిగింద‌నే విష‌యం త‌న‌కు తెలియ‌ద‌ని విశాల్ న్యాయ మూర్తితో వాదించారు. దీంతో తెలివిగా స‌మాధానం చెప్పాల‌న‌కుంటున్నారా? ఇదేం సినిమా షూటింగ్ కాదు.. స‌రిగ్గా స‌మాధానం చెప్పండి` అని న్యాయ‌మూర్తి విశాల్ ని ఆదేశించారు. దీంతో విశాల్ కోర్టు ఆదేశాల‌ను అనుస‌రించి న‌డుచుకున్న‌ట్లు తెలుస్తోంది.

ఇక విశాల్ సినిమ‌ల సంగ‌తి చూస్తేఇటీవ‌లే `ర‌త్నం` సినిమాతో ప్రేక్ష‌కుల‌ముందుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. హ‌రి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ మంచి అంచ‌నాల‌తోనే రిలీజ్ అయింది. కానీ రొటీన్ యాక్ష‌న్ సినిమా కావ‌డంతో బాక్సాఫీస్ వ‌ద్ద తేలిపోయింది. దీంతో విక్ర‌మ్ కొంత కాలం హ‌రితో సినిమాలు చేయ‌క‌పోతేనే ఉత్త‌మం అన్న‌ట్లు నెటి జ‌నులు కామెంట్లు పోస్ట్ చేసారు.

ప్ర‌స్తుతం విశాల్ స్వీయా ద‌ర్శ‌క‌త్వంలో `డిటెక్టివ్-2` తెర‌కెక్క‌కుతోంది. ద‌ర్శ‌కుడిగా విశాల్ తొలి సినిమా ఇదే. ఈ సినిమాపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. `డిటెక్టివ్` చిత్రాన్ని మిస్కిన్ తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. కానీ సీక్వెల్ విష‌యంలో మిస్కిన్ త‌ప్పుకోవ‌డంతో విశాల్ రంగంలోకి దిగాడు.

Tags:    

Similar News