మహేష్ మూవీతో మొదలైన ట్రెండ్ అది!
అటుపై ప్రోమో టీజర్, ట్రైలర్ అంటూ రిలీజ్ వరకూ ప్రచారం ఠారెత్తి పోతున్నసంగతి తెలిసిందే.
సినిమా లాంచింగ్ కి ముందే ప్రచారం ఏ రేంజ్ లో జరుగుతోందో చెప్పాల్సిన పనిలేదు. టైటిల్ టీజర్ అంటూ సినిమా ప్రారంభోత్సవానికి ముందే జనాల్లోకి వదులుతున్నారు. ప్రారంభోత్సవం తర్వాత ప్రీ టీజర్ అంటూ మరోటి వదులుతున్నారు. అటుపై ప్రోమో టీజర్, ట్రైలర్ అంటూ రిలీజ్ వరకూ ప్రచారం ఠారెత్తి పోతున్నసంగతి తెలిసిందే. ఇదంతా ఈ మధ్య బాగా వెలుగులోకి వచ్చిన అంశంగా మారింది.
అయితే ఈ కల్చర్ ను పరిచయం చేసింది మాత్రం సూపర్ స్టార్ మహేష్ - మురగదాస్ అని చెప్పాలి. ఇలా ప్రీటీజర్ రిలీజ్ చేయడం అన్నది మహేష్ నటించిన 'స్పైడర్' సినిమాతోనే మొదలైంది. ఆ సినిమా ప్రకటన అనంతరం ప్రీ టీజర్ రిలీజ్ అయింది. దీంతో సినిమాకి ఓ రేంజ్ బజ్ క్రియేట్ అయింది. అటుపై రిలీజ్ వరకూ మురగదాస్ తీసుకొచ్చిన సస్పెన్స్ అంతా ఇంతా కాదు. ఆ బజ్ నే సినిమాకి కోట్ల రూపాయల బిజినెస్ చేసింది.
ఫలితం ఆశించిన స్థాయిలో రాకపోయినా బజ్ తోనే కోట్ల వ్యాపారం జరిగిపోయింది రెండు రాష్ట్రాల్లో. ఇదే తరహాలో చాలా కోలీవుడ్ సినిమాలు ప్రచారం మొదలు పెట్టాయి. ఈ మద్య ఆ ప్రచారం పీక్స్ కి చేరింది. ఇటీవలే 'జైలర్ -2' టైటిల్ టీజర్ రిలీజ్ అయింది. నెల్సన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం జైలర్ కి సీక్వెల్. జైలర్ భారీ విజయం సాధించడం...తాజాగా రిలీజ్ అయిన టైటిల్ టీజర్ తో సినిమాకు బజ్ పీక్స్ లోక్రియేట్ అవుతుంది.
నిజానికి ఈ సినిమాప్రారంభోత్సవం ఇంకా జరగలేదు. రెగ్యులర్ షూటింగ్ మొదలవ్వలేదు. కేవలం హిట్ ప్రాంచైజీ, సూపర్ స్టార్ ఇమేజ్ ని తెలివిగి బిజినెస్ యాంగిల్ లో టర్న్ చేసి క్రేజ్ తీసుకొస్తున్నారు. దీనికంటే ముందు సుకుమార్ కూడా 'పుష్ప-2' విషయంలో ఇదే స్ట్రాటజీ అనుసరించి సక్సెస్ అయ్యాడు. పాన్ ఇండియా లో ఆ సినిమా సూపర్ బిజినెస్ చేసింది. ఆ సినిమాపై అంచనాలు నూరుశాతం సక్సెస్ అయ్యాయి. తెలుగు సినిమాలు ఇంకా ఈ రకమైన స్ట్రాటజీని పూర్తి స్థాయిలో అమలు లోకి తీసుకు రాలేదు. అయితే ప్రచారం చేసినంత ఈజీ కాదు సక్సెస్ అందుకోవడం. ప్రచారానికి తగ్గట్టు సినిమాలో దమ్ము ఉండాలి.