SSMB29: సినిమా కంటే ముందు ఇలా పెళ్లికి..

ఇదిలా ఉంటే తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు తన నెక్స్ట్ మూవీ ప్రొడ్యూసర్ నారాయణ కూతురి వివాహ వేడుకకి హాజరయ్యారు.

Update: 2023-09-02 04:46 GMT

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. శ్రీలీల చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. వీలైనంత వేగంగా ఈ మూవీ కంప్లీట్ చేసి సంక్రాతికి రిలీజ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ దిశగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ అడుగులు వేస్తున్నారు. గుంటూరు కారం మూవీ కంప్లీట్ అయిన తర్వాత రాజమౌళి దర్శకత్వంలో SSMB 29 చిత్రాన్ని స్టార్ట్ చేయనున్నారు.

ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ మూవీగా ఈ సినిమాని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించేందుకు జక్కన్న సిద్ధమవుతున్నారు. వరల్డ్ అడ్వాంచర్ ట్రావెలర్ గా ఈ మూవీలో మహేష్ బాబు కనిపించనున్నట్లు ఇప్పటికే కన్ఫర్మ్ చేశారు. కెఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. సుమారు 500 కోట్ల వరకు ఈ సినిమాకి బడ్జెట్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

అంతకుమించి అయిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది ఆఖరులో లేదంటే వచ్చే ఏడాది ఆరంభంలో SSMB 29 ప్రీప్రొడక్షన్ వర్క్ ని జక్కన్న స్టార్ట్ చేసే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. ఇక రాజమౌళి క్యారెక్టర్ కి తగ్గట్లుగా మారడం కోసం మహేష్ బాబు ఇప్పటి నుంచే ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఇదిలా ఉంటే తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు తన నెక్స్ట్ మూవీ ప్రొడ్యూసర్ నారాయణ కూతురి వివాహ వేడుకకి హాజరయ్యారు.

ఈఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిర్మాతగా క్షణం క్షణం సినిమాతో కెఏళ్ళు నారాయణ తన కెరియర్ ని స్టార్ట్ చేశారు. ఇప్పటి వరకు ఏడు సినిమాల వరకు నిర్మించారు. అందులో సంతోషం, రాఖీ, హలో బ్రదర్ లాంటి సినిమాలు ఉన్నాయి. వాటి తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకొని మళ్ళీ రాజమౌళితో పాన్ వరల్డ్ సినిమాకి సిద్ధం అవుతున్నారు.

ఈ సినిమాతో స్టార్ ప్రొడ్యూసర్ గా తన బ్రాండ్ ని ఎస్టాబ్లిష్ చేసుకునే పనిలో కెఎల్ నారాయణ ఉన్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నారాయణ కుమార్తె వివాహ వేడుకకి హాజరై వధూవరులని ఆశీర్వదించారు. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Tags:    

Similar News