వీడియో: ఎంత దాచాలనుకున్నా దాగని మలైకం!
తాజాగా మలైకా షేర్ చేసిన ఓ వీడియో గుండెల్లో గుబులు రేపుతోంది. ఈ వీడియోలో మలైకా ఆల్మోస్ట్ 'అందాల జాతర'కు తెర తీసిందని నెటిజనులు అభిప్రాయపడుతున్నారు.
మలైకా అరోరా స్టన్నింగ్ లుక్స్ ఇంటర్నెట్ లో అగ్గి రాజేస్తున్నాయి. ఇన్ స్టా వేదికగా మల్లా (మలైకా) షేర్ చేసే ఫోటోషూట్లు యువతరం కంటికి కునుకుపట్టనీకుండా చేస్తున్నాయి. ఓవైపు బోయ్ ఫ్రెండ్ తో షికార్లు తగ్గించినా కానీ, డిన్నర్ డేట్ ల సందడి అంతగా కనిపించకపోయినా కానీ.. మలైకా వరుస ఫోటోషూట్లతో చెలరేగుతూ తనను తాను లైమ్ లైట్ లో ఉంచుతోంది.
తాజాగా మలైకా షేర్ చేసిన ఓ వీడియో గుండెల్లో గుబులు రేపుతోంది. ఈ వీడియోలో మలైకా ఆల్మోస్ట్ 'అందాల జాతర'కు తెర తీసిందని నెటిజనులు అభిప్రాయపడుతున్నారు. మలైకా ఇన్నర్ అందాల హొయలు మతులు చెడగొడుతున్నాయి. అయితే ఆ అందాలను కాపాడేందుకు లేదా కవర్ చేసేందుకు మలైకా పాట్లు ఇబ్బందులు కూడా బయటపడ్డాయి. అలా హొయలొలికిస్తూ హంసనడకలతో హీట్ పుట్టిస్తున్న మలైకా వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ ని బ్రేక్ చేస్తోంది. యువతరం ఈ వీడియోని జోరుగా వైరల్ చేస్తున్నారు.
కాలి తొడ భాగంలో నల్లని గాయం:
వేరొక ఫోటోషూట్ లో మరో విషయం బయటపడింది. ఆ ఫోటోలను పరిశీలిస్తే.. మలైకా అరోరా కాలికి గాయమైన సంగతి తెలిసింది. తన కాలి తొడ భాగంలో నల్లని గాయం హైలైట్ గా కనిపిస్తోంది. అయితే ఈ గాయం బయటికి కనిపించకుండా చేసేందుకు మలైకా చాలా ప్రయత్నించినా అది వీలు పడలేదు. బాలీవుడ్ సోయగం మలైకా అరోరా గురువారం (అక్టోబర్ 26) ముంబైలోని ఒక సెలూన్ వెలుపల కనిపించింది.
మలైకా ఇంతలోనే తన కుడి కాలుపై ఉన్న పెద్ద నల్లటి గాయాన్ని దాచుకోవడానికి ప్రయత్నిస్తున్న వైనం బయటపడింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మలైకా ప్రింటెడ్ షార్ట్ బ్లాక్ టీ-షర్ట్ ధరించి కనిపించిన ఈ వీడియోలో తన ఇబ్బంది అందరికీ అర్థమైంది.
సోషల్ మీడియాలో వీడియోలు కనిపించిన వెంటనే, పోస్ట్‌ల వ్యాఖ్యల విభాగంలో అభిమానులు మలైకా కాలి గాయం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. అయితే కొందరు నెటిజనులు ఆ గాయాన్ని దాచాలనుకుంటే షార్ట్‌లకు బదులుగా ప్యాంట్ ధరించవచ్చని సలహాలు ఇచ్చారు. కొందరు దీనిని 'పుట్టు మచ్చ' అని కూడా డౌట్ వ్యక్తం చేసారు. ఇది తొడల వ్యాయామం వల్ల అయిన మచ్చ కావచ్చునని మరొకరు వ్యాఖ్యానించారు. హెవీ వెయిట్ తొడ వ్యాయామం కి వాజా సే హువా హై ..బ్లడ్ క్లాట్ అయిందని ఒకరు కామెంట్ చేసారు. అరే దీదీ ఏమైంది అని ఒకరు అన్నారు.
అక్టోబర్ 23న మలైకా తన 48వ పుట్టినరోజును నటుడు-ప్రియుడు అర్జున్ కపూర్ సహా స్నేహితులతో కలిసి సెలబ్రేట్ చేసుకుంది. అర్జున్ రొమాంటిక్ పుట్టినరోజు శుభాకాంక్షలు అందరిలోను చర్చగా మారాయి.
హ్యాపీ బర్త్‌డే బేబీ! అని అతడు ప్రేమను వ్యక్తపరిచాడు.