సంయుక్త స్పీడుకి బ్రేక్ ఎందుకు వచ్చింది!
విరూపాక్ష తర్వాత కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమాలో నటిస్తున్న సంయుక్త ఆ తర్వాత మాత్రం ఏ సినిమాకు సైన్ చేయలేదు. అవకాశాలు రావట్లేదా లేదా నచ్చిన కథ దొరక్క వెయిట్ చేస్తుందా అన్నది తెలియదు కానీ డెవిల్ తర్వాత సంయుక్త సినిమా ఏది అన్నది ఇంకా క్లారిటీకి రాలేదు
మలయాళ భామ సంయుక్త మీనన్ తెలుగులో చేసిన నాలుగు సినిమాలు కూడా హిట్ అవడంతో అమ్మడికి సూపర్ క్రేజ్ ఏర్పడింది. పవన్, రానా నటించిన భీమ్లా నాయక్ సినిమాలో నటించిన సంయుక్త ఆ తర్వాత బింబిసార, సార్, విరూపాక్ష ఇలా వరుస సినిమాలు అవి కూడా సూపర్ హిట్ అవడంతో సంయుక్త లక్కీ హీరోయిన్ గా మారింది. మలయాళంలో కూడా తన మార్క్ నటనతో మెప్పిస్తూ వస్తున్న అమ్మడికి టాలీవుడ్ లో ఈ స్టార్ డం ఊహించలేదు. తనకు వచ్చిన పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేయడంలో తన టాలెంట్ చూపిస్తున్న సంయుక్త అందుకు తగినట్టుగానే సినిమా ఫలితాలను అందుకుంటుంది.
విరూపాక్ష తర్వాత కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమాలో నటిస్తున్న సంయుక్త ఆ తర్వాత మాత్రం ఏ సినిమాకు సైన్ చేయలేదు. అవకాశాలు రావట్లేదా లేదా నచ్చిన కథ దొరక్క వెయిట్ చేస్తుందా అన్నది తెలియదు కానీ డెవిల్ తర్వాత సంయుక్త సినిమా ఏది అన్నది ఇంకా క్లారిటీకి రాలేదు. ఒకటి రెండు సినిమాలు డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయని తెలుస్తున్నా వాటి గురించి కూడా డీటైల్స్ ఇంకా బయటకు రాలేదు. తెలుగులో చేసిన సినిమాలన్నీ హిట్లు అందుకున్నా సరే సంయుక్త కెరీర్ కి బ్రేక్ పడటం అందరికి షాక్ ఇస్తుంది.
అయితే సంయుక్త కేవలం హీరోయిన్ ప్రాధాన్యత ఉన్న పాత్రలు.. కథా బలం ఉన్న సినిమాలే చేస్తానని చెబుతుందట. అంతేకాదు కమర్షియల్ సినిమాలో గ్లామర్ కోసమే అయితే తన దగ్గరకు రావాల్సిన అవసరం లేదని కూడా తన మేనేజర్ తో చెప్పిస్తుందట. అందుకే సంయుక్తకు ఆఫర్లు రావట్లేదని అంటున్నారు. ఏ సినిమా పడితే ఆ సినిమా చేసి ఇమేజ్ తగ్గించుకోవడం కన్నా ఉన్న క్రేజ్ ని మరింత పెంచుకునేలా సినిమాలు చేయాలని భావిస్తుంది సంయుక్త.
తెలుగులో ఛాన్స్ లు రాకపోయినా సార్ తమిళ వెర్షన్ కూడా హిట్ అవడంతో కోలీవుడ్ నుంచి కూడా సంయుక్తకి ఛాన్స్ లు వస్తున్నట్టు తెలుస్తుంది. అయితే అక్కడ కూడా అమ్మడి స్టోరీ నచ్చితేనే చేస్తానని చెబుతుందట. కెరీర్ గ్రాఫ్ పెంచుకునే క్రమంలో ఎలాంటి మొహమాటాలు పోకుండా నచ్చిన కథలనే చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యింది సంయుక్త. అందుకే ఆమెకు ఆఫర్లు తగ్గాయని చెప్పుకుంటున్నారు.
గ్లామర్ రోల్స్ కి తాను దూరం కాదు కానీ పాత్రకు ఏది అవసరమో అది చేయాలి తప్ప అవసరం లేకుండా గ్లామర్ షో చేయాల్సిన పని లేదని అంతకుముందు తన అభిప్రాయాన్ని చెప్పింది సంయుక్త. సో ఫ్యూచర్ లో అమ్మడు గ్లామర్ రోల్స్ లో కూడా చూసే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.