ఇక్క‌డ వ‌రుణ్ తేజ్.. అక్క‌డ మ‌ల్హోత్రా పార్టీలు

వ‌రుణ్ తేజ్-లావ‌ణ్య జంట పెళ్లి అనంత‌రం రిసెప్ష‌న్ ఈ ఆదివారం సాయంత్రం వైభ‌వంగా జ‌రుగుతోంది. అదే స‌మ‌యంలో ముంబైలో మ‌నీష్ మ‌ల్హోత్రా అద్భుత‌మైన ఈవెంట్ ని ప్లాన్ చేయ‌డం ఆస‌క్తిక‌రం.

Update: 2023-11-06 03:52 GMT

పండుగల సీజన్ పూర్తి స్వింగ్‌లో ఉంది. ఇటీవ‌ల బాలీవుడ్ లో దేవీ న‌వ‌రాత్రుల వేళ సెల‌బ్రిటీల ఇండ్ల‌లో ఈవెంట్ల‌తో హ‌డావుడి నెల‌కొంది. మ‌రోవైపు బాలీవుడ్ స‌హా టాలీవుడ్ స్టార్ల‌కు ఇష్టమైన డిజైనర్ మనీష్ మల్హోత్రా మోస్ట్ అవైటెడ్ దీపావళి పార్టీని ముంబైలోని త‌న స్వ‌గృహంలో నిర్వ‌హించారు. ఈ ఆదివారం రాత్రి ఫ్యాషన్ మాస్ట్రో మ‌నీష్‌ తన విలాసవంతమైన నివాసానికి తలుపులు తెరిచి ఉంచాడు. టాప్ బాలీవుడ్ సెలబ్రిటీల ఎలైట్ గెస్ట్ లిస్ట్‌ను ఈ పార్టీ కోసం స్వాగతించాడు. ఈ రాత్రిలో మిళ‌మిళ మిరుమిట్లు గొలిపే తార‌లెంద‌రో ఈవెంట్ కి హాజ‌ర‌వుతున్నారు.


చిత్ర పరిశ్రమతో పాటు ఫ్యాషన్ ఔత్సాహికులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ ఈవెంట్ శైలి, స్నేహబంధం, దీపాల పండుగ సాంప్రదాయ వైభవానికి తార్కాణం. మనీష్ మల్హోత్రా, తన సున్నితమైన డిజైన్‌లు అద్భుత‌ ఎంపికలతో మ‌న‌సుల‌ను గెలిచాడు. ఫ్యాషన్ ప్రపంచంలో తనకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు. అతడి అద్భుతమైన హోస్టింగ్ నైపుణ్యాల కీర్తినందుకున్నాయి.


మ‌నీష్ మ‌ల్హోత్రా దీపావ‌ళి పార్టీకి బాలీవుడ్ తో పాటు ప‌లువురు సౌత్ నాయిక‌లు ఎటెండ్ కానున్నార‌ని తెలుస్తోంది. ఈ పార్టీకి క‌ర‌ణ్ జోహార్ స‌హా టాప్ స్టార్లు అటెండ‌వుతారు. ఇందులో స‌మంత కూడా ఉండే అవ‌కాశం ఉంద‌ని టాక్ వినిపిస్తోంది. స్టార్ల‌తో ఈవెంట్ ఎంతో క‌న్నుల‌పండుగగా సాగ‌నుంద‌ని స‌మాచారం. ఓవైపు మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్-లావ‌ణ్య జంట పెళ్లి అనంత‌రం రిసెప్ష‌న్ ఈ ఆదివారం సాయంత్రం వైభ‌వంగా జ‌రుగుతోంది. అదే స‌మ‌యంలో ముంబైలో మ‌నీష్ మ‌ల్హోత్రా అద్భుత‌మైన ఈవెంట్ ని ప్లాన్ చేయ‌డం ఆస‌క్తిక‌రం.

ఇటీవ‌లే మనీష్ సినీనిర్మాణంలో అడుగుపెట్టిన సంగ‌తి తెలిసిందే. తన ప్రొడక్షన్ బ్యానర్‌లో బన్ టిక్కి అనే రెండవ ప్రాజెక్ట్‌ను ప్రకటించాడు. ఈ చిత్రంలో అభయ్ డియోల్, షబానా అజ్మీ నటించనున్నారు ఫరాజ్ ఆరిఫ్ అన్సారీ దర్శకత్వం వహించనున్నారు. ఆసక్తికరంగా ఈ చిత్రంతో ప్రముఖ నటి జీనత్ అమన్ పునరారంగేట్రం చేస్తున్నారు. అదే విషయాన్ని ప్రకటిస్తూ మల్హోత్రా ఇలా వ్రాశాడు. మా రెండో సినిమా షూటింగ్ ఈ నెలలో ప్రారంభమవుతుంది. ఈ ప్రత్యేకమైన చిత్రం గురించి మేమంతా చాలా సంతోషిస్తున్నాము... అని అన్నారు.

Tags:    

Similar News