ఇండస్ట్రీ రాజకీయాలపై హీరోల చాటింగ్ లీక్
ఇంతలోనే ఇప్పుడు సుశాంత్ సింగ్ ని గుర్తు చేసుకున్నాడు ప్రముఖ నటుడు, జాతీయ అవార్డ్ గ్రహీత మనోజ్ భాజ్ పాయ్.
దేశవ్యాప్తంగా గొప్ప అభిమానులను సంపాదించుకుని ప్రజల హృదయాల్లో నిలిచిన బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అకాల మరణం గురించి తెలిసిందే. 2020లో అతడు తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు ప్రకటించారు. కానీ దీనిని అనుమానాస్పద మరణంగా అభిమానులు భావిస్తారు. దీనిపై చాలా కోణాల్లో విచారణ సాగుతోంది. కానీ అంతిమ తీర్పు మాత్రం వెలువడలేదు.
ఇంతలోనే ఇప్పుడు సుశాంత్ సింగ్ ని గుర్తు చేసుకున్నాడు ప్రముఖ నటుడు, జాతీయ అవార్డ్ గ్రహీత మనోజ్ భాజ్ పాయ్. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తో కలిసి షూటింగ్ చేస్తున్నప్పుడు తాను ఇచ్చిన సలహా గురించి మనోజ్ బాజ్‌పేయి గుర్తు చేసుకున్నాడు. పరిశ్రమలో అందంగా కనిపించడంతో పాటు, మానసికంగా ధృఢంగా ఉండటం అలవాటు చేసుకోవాలని తాను సుశాంత్ కి సూచించినట్టు మనోజ్ భాజ్ పాయ్ వెల్లడించాడు.
`సోంచిరియా` చిత్రంలో సుశాంత్‌తో కలిసి నటించాడు మనోజ్ బాజ్‌పేయి. తాజా ఇంటర్వ్యూలో భాజ్ పాయ్ దివంగత నటుడిని గుర్తుచేసుకున్నారు. వారి కలిసి కొంత సమయం గడిపారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన బాజ్‌పేయి.. సుశాంత్ మరణం తనపైనా, పరిశ్రమపైనా చూపిన ఘాఢమైన ప్రభావం గురించి తాజా చాటింగ్ సెషన్ లో మాట్లాడారు.
చిత్ర పరిశ్రమలోని ఒడిదుడుకులను చాలా కాలంగా ఎదుర్కొన్న అనుభవజ్ఞుడైన నటుడు మనోజ్ బాజ్‌పేయి.. ఆ అనుభవాలతోనే బయటి ఒత్తిళ్ల గురించి వివరించానని అన్నారు. సుశాంత్ కి స్థిరంగా నటనపై దృష్టి కేంద్రీకరించమని ప్రోత్సహించానని తెలిపాడు. పరిశ్రమలో మనుగడ సాగించాలంటే మానసిక బలం అవసరాన్ని ఆయన సూచించారట. బయటి నుంచి వచ్చే శబ్దాలు ఎలా ఉన్నా.. నటనా నైపుణ్యం విషయంలో నిజాయితీగా ఉండాలని సలహా ఇచ్చినట్టు తెలిపారు. మేం పరిశ్రమలో రాజకీయాల గురించి చాట్ చేసేవాళ్ళం. నేను ఎల్లప్పుడూ స్ట్రాంగ్ గా ఉండాలని చెప్పానని మనోజ్ అన్నారు. ఎన్నో తిరస్కరణలతో తనకు ఈ అనుభవం వచ్చిందని అన్నారు. నా స్నేహితులు చాలా మంది నాలాగే తిరస్కరణలను తట్టుకోలేకపోయారు అని కూడా అన్నారు. సెట్లో ఉన్నప్పుడు.. మీరు స్వయంగా వండిన మటన్ తినేందుకు నన్ను పిలవండి అని సుశాంత్ తనను కోరినట్టు మనోజ్ భాజ్ పాయ్ గుర్తు చేసుకున్నారు.