యానిమల్ అబ్రార్ మూడో భార్య రెడ్ అలెర్ట్
దీనికి తోడు శిక్కు కాని వాడు.. శిక్కులకు బ్రదర్ అయిన వాడు అబ్రార్ అలియాస్ రేపిస్ట్ పై తీసిన సన్నివేశాలు మరో ఎత్తు.
`యానిమల్` సినిమా చాలా కోణాల్లో విస్త్రతంగా చర్చనీయాంశమైంది. ఈ సినిమాలో మితిమీరిన హింస, రక్తపాతం ఒక ఎత్తు అనుకుంటే అత్యాచారాలు మరో ఎత్తు. ఇందులో శిక్కు కుర్రాళ్ల దూకుడు అమ్మాయిలతో శృంగార కలాపాల గురించిన కుర్రాళ్ల ఆసక్తిపై దర్శకుడు సందీప్ వంగా సన్నివేశం చూపించడం ఆశ్చర్యకరం.
దీనికి తోడు శిక్కు కాని వాడు.. శిక్కులకు బ్రదర్ అయిన వాడు అబ్రార్ అలియాస్ రేపిస్ట్ పై తీసిన సన్నివేశాలు మరో ఎత్తు. ఓవైపు తనకు మాటలు రాకపోయినా కానీ, దానిని సైగల ద్వారా అనువదించే ఒక మంచి దోస్తానాను చూపించడంలో సందీప్ వంగా ఎత్తుగడ శైలి ప్రతిదీ అలరించాయి.
ఓవైపు రణబీర్ కపూర్ మరోవైపు బాబి డియోల్ పోటీపడుతూ తమ సన్నివేశాల్లో నటించారు. ఇందులో రణ్ విజయ్ (రణబీర్) తో ఘాటైన రొమాన్స్ చేసే యువతిగా డిప్తి దిమ్రీ పాత్రను రక్తి కట్టించేలా చూపించాడు సందీప్. అయితే అంతగా గుర్తింపు లేకపోయినా ఒకే ఒక్క సన్నివేశంలో కనిపించినా కానీ నటి కం మోడల్ మాన్సీ టక్సాక్ పాత్రా చర్చనీయాంశమే అయింది. ఈ బ్యూటీ యానిమల్ చిత్రంలో అబ్రార్ (బాబీ డియోల్) మూడవ భార్యగా కనిపించింది. వివాహ ఎపిసోడ్‌లోని అత్యాచార సన్నివేశం సినిమాలోని ఇతర సన్నివేశాలతో పాటు ఎక్కువగా చర్చనీయాంశమైంది. అబ్రార్ చేతిలో అత్యాచారానికి గురైన యువతిగా కనిపిస్తుంది మాన్సీ. ఇప్పుడు ఈ అందమైన అమ్మాయి హాయ్ సెలెబ్ మ్యాగజైన్ కవర్ కోసం పోజులిచ్చింది. కవర్ పేజీ ముఖచిత్రంగా మారిన మాన్సీ యువతరాన్ని మంత్రముగ్దులను చేసింది.
ఎరుపు రంగు వాల్టర్ మినీ మెష్ దుస్తుల్లో మాన్సీ గుబులు రేపింది. షారుఖ్ ఖాన్ బ్లాక్ బస్టర్ మూవీ పఠాన్ లో మాన్సీ ఒక చిన్న పాత్రలో కనిపించిందనే విషయం చాలామందికి తెలియదు. మాన్సీ జాన్ అబ్రహం లవర్ గా, గర్భవతిగా కనిపించింది. ఇలాంటి అతిథి పాత్రల్లో కనిపించినా కానీ మాన్సీ తనదైన ముద్ర వేస్తూ మునుముందు పెద్ద అవకాశాల్ని అందుకుంటుందనడంలో సందేహం లేదు. యానిమల్ లో సందీప్ వంగా చూపించిన ప్రతి పాత్రా నిజజీవితంలో చూసినవేనని అబ్రార్ పాత్రధారి అయిన బాబీ డియోల్ ఇంతకుముందు వ్యాఖ్యానించారు. రియాలిటీ అంతకంటే కఠోరంగా ఉందని కూడా చెప్పాడు.