లావణ్యతో నాకు ఎలాంటి రిలేషన్ లేదు - మస్తాన్

ఆమె డ్రగ్స్ కి అలవాటు పడిందని, మస్తాన్ అనే వ్యక్తితో గతంలో రిలేషన్ లో ఉందని అతనిపై చీటింగ్ కేసు కూడా పెట్టిందని ఆరోపించారు.

Update: 2024-07-08 15:35 GMT

హీరో రాజ్ తరుణ్ పై అతని ప్రియురాలు పోలీసులకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. 11 ఏళ్ళు సహజీవనం చేసి ఇప్పుడు మాల్వీ మల్హోత్రాతో ఎఫైర్ పెట్టుకొని తనని వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించింది. దీనిపై లావణ్య లీగల్ ఫైట్ కి రెడీ అయ్యింది. మరో వైపు హీరో రాజ్ తరుణ్ కూడా లావణ్యపై సంచలన ఆరోపణలు చేశారు. ఆమె డ్రగ్స్ కి అలవాటు పడిందని, మస్తాన్ అనే వ్యక్తితో గతంలో రిలేషన్ లో ఉందని అతనిపై చీటింగ్ కేసు కూడా పెట్టిందని ఆరోపించారు.

అలాగే లావణ్య పస్తుతం ఉంటున్న నా ప్లాట్ ని సొంతం చేసుకోవాలని ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేసిందని రాజ్ తరుణ్ ఆరోపించారు. ఆమె రెగ్యులర్ గా డ్రగ్స్ తీసుకుంటుందని, వాటి కోసమే తనని డబ్బులు డిమాండ్ చేస్తుందని రాజ్ తరుణ్ మీడియాతో చెప్పారు. ఇక మాల్వీ మల్హోత్రా లావణ్య పై పోలీసులకి ఫిర్యాదు చేసింది. లావణ్య నా మీద అసత్య ఆరోపణలు చేస్తూ నా వ్యక్తిత్వాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తుందని మాల్వీ ఆరోపించింది. రాజ్ తరుణ్ తో తనకి ఎలాంటి ఎఫైర్ లేదని మాల్వీ మీడియా ముఖంగా తెలియజేసింది.

ఇదిలా ఉంటే తాజాగా లావణ్య మరల మీడియా ముందుకొచ్చి రాజ్ తరుణ్ తో తనకి పెళ్లి అయ్యిందని, ఈ విషయం చాలా మందికి తెలుసని, ఆధారాలు కూడా తన దగ్గర ఉన్నాయని పేర్కొంది. రాజ్ తరుణ్ కి చాలా మందితో ఎఫైర్స్ ఉండేవని కూడా ఆరోపించింది. ఇదే సమయంలో ఛానల్ యాంకర్ రాజ్ తరుణ్ ఆరోపణలు చేసిన మస్తాన్ ని ఫోన్ ద్వారా లైన్ లోకి తీసుకున్నారు.

లావణ్యతో తనకి ఎలాంటి రిలేషన్ షిప్ లేదని, రాజ్ తరుణ్ తనపై కావాలని ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఫాల్స్ ఎలిగేషన్ చేస్తున్నాడని మస్తాన్ అన్నారు. అతను ఎందుకు అలా మాట్లాడుతున్నాడో నాకు అర్ధం కావడం లేదని తెలిపాడు. ఒక మ్యూజిక్ ఈవెంట్ కోసం లావణ్యతో కాంట్రాక్ట్ అయ్యానని, తరువాత రాజ్ తరుణ్ పరిచయం అయ్యారని మస్తాన్ చెప్పుకొచ్చాడు. అలాగే లావణ్య, రాజ్ తరుణ్ వ్యక్తిగత విషయాల గురించి నాకు పెద్దగా తెలియదని క్లారిటీ ఇచ్చాడు.

ఇప్పుడు లావణ్యతో నాకు ఏదో ఎఫైర్ ఉందని రాజ్ తరుణ్ ఆరోపణలు చేస్తుంటే ఆశ్చర్యంగా అనిపించిందని అన్నారు. రాజ్ తరుణ్ చూపించిన ఎఫ్ఐఆర్ కూడా ప్రేమకి సంబందించింది కాదని, వేరొక ఇష్యూకి సంబంధించింది అని తెలిపాడు. అలాగే ఆ కేసుని కాంప్రమైజ్ చేసుకుంటున్నామని కూడా మస్తాన్ తెలియజేశాడు. రాజ్ తరుణ్ తో కూడా నాకు మరీ పెద్ద బాండింగ్ ఏమీ లేదని మస్తాన్ క్లారిటీ ఇచ్చాడు.

లావణ్య ఆరోపణలని డైవర్ట్ చేయడానికి రాజ్ తరుణ్ నా పేరుని వాడుకుంటున్నాడు అనిపిస్తుందని మస్తాన్ యాంకర్ తో చెప్పుకొచ్చాడు. రాజ్ తరుణ్ తనకి కావాలని, ఈ ఇష్యూపై లీగల్ గా ఎంత వరకైనా ఫైట్ చేస్తానని చెబుతుంది. రాజ్ తరుణ్ అయితే లావణ్య మీద ఫిర్యాదు చేస్తానని రెండు రోజుల క్రితం చెప్పాడు. మరల ఇప్పటి వరకు ఆయన రియాక్ట్ కాలేదు. ఈ కేసు వ్యవహారం టాలీవుడ్ లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News