మత్తు వదలరా 2.. ఆ నలుగురి ఆశలు..

మరి హీరోగా శ్రీసింహ, దర్శకుడిగా రితేష్ రానా, మ్యూజిక్ డైరెక్టర్ గా కాల భైరవ, హీరోయిన్ గా ఫరియాకి మత్తు వదలరా 2 ఎలాంటి సక్సెస్ ఇస్తుందనేది చూడాలి.

Update: 2024-09-12 04:12 GMT

కీరవాణి తనయుడు శ్రీసింహ హీరోగా రితేష్ రానా దర్శకత్వంలో తెరకెక్కిన మత్తు వదలరా 2 మూవీ సెప్టెంబర్ 13న థియేటర్స్ లోకి వస్తోంది. సత్య, ఫరియా అబ్దుల్లా, సునీల్ ఈ చిత్రంలో కీలక పాత్రలలో నటించారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకొచ్చిన ట్రైలర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. డిఫరెంట్ కంటెంట్ తోనే మత్తు వదలరా 2 మూవీ రాబోతోందని అర్ధమవుతోంది.

ఈ మధ్య చిన్న సినిమాలు పెద్ద సక్సెస్ లు అందుకుంటున్నాయి. ఈ కారణంగా మత్తు వదలరా 2 పైన కూడా అంచనాలు పెరిగాయి. 2019లో వచ్చిన హిట్ మూవీ మత్తు వదలరాకి సీక్వెల్ గా దీనిని తెరకెక్కించారు. డిఫరెంట్ ప్రమోషన్ స్ట్రాటజీలతో ఈ చిత్రాన్ని ప్రేక్షకులకి చేరువ చేసే ప్రయత్నం చిత్ర యూనిట్ చేస్తోంది. కాల భైరవ మ్యూజిక్ కూడా ఈ చిత్రానికి అదనపు అస్సెట్ అనే మాట వినిపిస్తోంది.

'మత్తు వదలరా'తో హీరోగా పరిచయం అయిన శ్రీసింహ తరువాత తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త, భాగ్ సాలే, ఉస్తాద్ సినిమాలు చేసాడు. ఈ సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. డిఫరెంట్ కంటెంట్ కథలతో మూవీస్ చేస్తున్నప్పటికి కమర్షియల్ బ్రేక్ మాత్రం రావడం లేదు. సరైన మార్కెట్ కూడా శ్రీసింహకి ఇంకా క్రియేట్ కాలేదు. అలాగే మత్తు వదలరాతోనే కాల భైరవ మ్యూజిక్ డైరెక్టర్ గా మారాడు. ఇప్పటి వరకు మ్యూజిక్ డైరెక్టర్ గా కాల భైరవ 14 సినిమాలు చేసాడు.

వాటిలో కలర్ ఫోటో, కార్తికేయ 2 సినిమాలు అతనికి మంచి ఇమేజ్ తీసుకొచ్చాయి. కార్తికేయ 2 రేంజ్ కమర్షియల్ బ్రేక్ ఇచ్చే సినిమా మరల కాల భైరవకి పడలేదు. అలాగే జాతిరత్నాలు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన ఫరియా అబ్దుల్లా తరువాత సరైన సక్సెస్ లు అందుకోలేకపోయింది. ఇక దర్శకుడు రితేష్ రానా కూడా మత్తు వదలరా తర్వాత లావణ్య త్రిపాఠితో హ్యాపీ బర్త్ డే అనే మూవీ చేసి డిజాస్టర్ అందుకున్నారు.

వీరందరికి కూడా మత్తు వదలరా 2 మూవీ కమర్షియల్ గా సక్సెస్ అవ్వడం చాలా అవసరం. ఈ మూవీ హిట్ అయితే అందరికి కూడా మంచి బ్రేక్ లభించినట్లే. సినిమాపై పాజిటివ్ బజ్ నడుస్తోన్న నేపథ్యంలో కచ్చితంగా మొదటి రోజు మంచి ప్రేక్షకాదరణ లభించే ఛాన్స్ ఉంటుంది. తరువాత కంటెంట్ ని ఎలా చెప్పారనే దానిని బట్టి సక్సెస్ ఆధారపడి ఉంటుంది. మరి హీరోగా శ్రీసింహ, దర్శకుడిగా రితేష్ రానా, మ్యూజిక్ డైరెక్టర్ గా కాల భైరవ, హీరోయిన్ గా ఫరియాకి మత్తు వదలరా 2 ఎలాంటి సక్సెస్ ఇస్తుందనేది చూడాలి.

Tags:    

Similar News