మరో హిట్ మూవీ సీక్వెల్ కి రెడీ
ఒకప్పుడు సీక్వెల్ వార్తలు చాలా అరుదుగా మాత్రమే వస్తూ ఉండేవి. కానీ ఇప్పుడు సీక్వెల్ అంటూ రెగ్యులర్ గా వార్తలు వస్తూనే ఉన్నాయి
ఒకప్పుడు సీక్వెల్ వార్తలు చాలా అరుదుగా మాత్రమే వస్తూ ఉండేవి. కానీ ఇప్పుడు సీక్వెల్ అంటూ రెగ్యులర్ గా వార్తలు వస్తూనే ఉన్నాయి. స్టార్ హీరోల సినిమాల నుంచి చిన్న హీరోల సినిమాల వరకు అన్నింటికి కూడా సీక్వెల్స్ వస్తున్నాయి. స్టార్ హీరోల సినిమాల కు పోటీ అన్నట్లుగా చిన్న హీరోల సినిమాల సీక్వెల్స్ రూపొందుతున్నాయి.
ఇప్పుడు శ్రీ సింహా హీరోగా రితేష్ రానా దర్శకత్వంలో రూపొంది 2019 సంత్సరంలో వచ్చిన 'మత్తువదలరా' సినిమా కి సీక్వెల్ రాబోతుంది. ఆ కథ కు సీక్వెల్ స్కోప్ ఉంది. అందుకే మేకర్స్ సీక్వెల్ ను ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.
మత్తువదలరా సినిమా ఒక సింపుల్ సినిమాగా విడుదల అయినా కూడా మౌత్ టాక్ తో హిట్ సొంతం చేసుకుంది. మంచి ఎంటర్‌టైనర్ గా రివ్యూలు వచ్చాయి. ప్రేక్షకులు కూడా సినిమాను ఆధరించి మంచి వసూళ్లు ఇచ్చినట్లుగా బాక్సాఫీస్ వర్గాల సమాచారం.
మత్తు వదలరా సినిమా తర్వాత హీరో శ్రీ సింహా మరియు దర్శకుడు రితేష్ రానా లు ఇతర సినిమాలు చేసినా కూడా పెద్దగా విజయాన్ని సొంతం చేసుకోలేదు. దాంతో మళ్లీ మత్తువదలరా సినిమాతోనే హిట్ కొట్టాలనే పట్టుదలతో సినిమా సీక్వెల్ కి సిద్ధం అవుతున్నారని తెలుస్తోంది.
ఇప్పటి వరకు ఈ సీక్వెల్ గురించి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కానీ త్వరలోనే అన్ని విషయాలపై క్లారిటీ ఇస్తూ అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. సీక్వెల్ లో నటీ నటులు కంటిన్యూ అవ్వడంతో పాటు, కథ ను కూడా గత చిత్రానికి అనుబంధంగా రూపొందించే విధంగా ప్లాన్ చేస్తున్నారట. మరి ఈ సీక్వెల్ ఎంత వరకు ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.