మట్కా ఫస్ట్ గ్లింప్స్.. పవర్ఫుల్ వరుణ్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బర్త్ డే సందర్భంగా ఆయన హీరోగా కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మట్కా మూవీ నుంచి గ్లింప్స్ ని రిలీజ్ చేశారు
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బర్త్ డే సందర్భంగా ఆయన హీరోగా కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మట్కా మూవీ నుంచి గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. మట్కా ఓపెనింగ్ బ్రాకెట్ పేరుతో ఈ గ్లింప్ వీడియోని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. పీరియాడిక్ జోనర్ లో మాఫియా బ్యాక్ డ్రాప్ కథతో ఉన్నట్లు ఈ వీడియో గ్లింప్స్ బట్టి తెలుస్తోంది. ఇందులో నవీన్ చంద్రని గ్యాంగ్ స్టార్ పాత్రలో ఆవిష్కరించారు.
రవి శంకర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నాడు. గ్రామ్ ఫోన్ రేడియోని ఆన్ ఆన్ చేయడంతో వీడియో గ్లింప్స్ లో ఓపెనింగ్ షాట్ స్టార్ట్ చేసి తరువాత దివిటీని వెలిగించగా. పోలీసులు కొంతమంది ఎవరినో పట్టుకోవడానికి పరుగెత్తుతున్నారు. హీరో చిన్నప్పుడు కబడ్డీ ఆడటానికి రెడీ కావడం. ఆ ప్రభుత్వ అధికారినిగా ఆమని పాత్రని చూపించాడు. నవీన్ చంద్రని గ్యాంగ్ స్టార్ గా ఎస్టాబ్లిష్ చేస్తూ సిగార్ కల్చుతున్న హీరో వరుణ్ తేజ్ ఫోన్ లో ఎవరికో ప్రామిస్ చెప్పడంతో గ్లింప్స్ ఎండ్ చేశాడు.
ఇక ఈ షాట్స్ కి తగ్గట్లుగానే జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ ఎలివేషన్ ఇంటరెస్టింగ్ కంటెంట్ ని ప్రెజెంట్ చేసింది. రిట్రో స్టైల్ లో సాగిన విజువల్ కథ నేపథ్యాన్ని ఆవిష్కరించాయి. గ్లింప్స్ చూస్తుంటే వరుణ్ తేజ్ కెరియర్ లో ఇప్పటి వరకు చేయనటువంటి ఇంటరెస్టింగ్ క్యారెక్టర్ ని మట్కాలో చేస్తున్నట్లు తెలుస్తోంది. కబడ్డీ ప్లేయర్ గా ఉండే హీరో గ్యాంబ్లింగ్ మాఫియా లీడర్ గా ఎలా మారాడు అనేది ఈ మూవీలో చూపించాబోతున్నారు.
1958 నుంచి 1982 మధ్యకాలంలో జరిగిన కథగా మూవీ ఉండబోతోంది. రియల్ లైఫ్ సంఘటనల స్ఫూర్తిగా కరుణ కుమార్ ఈ మూవీ కథని సిద్ధం చేసుకొని భారీ బడ్జెట్ తో సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరిస్తున్నారు. వైరా ఎంటర్టైన్మెంట్స్, ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో ఐదు భాషలలో ఈ మూవీ తెరకెక్కబోతోంది.
ఈ చిత్రంలో వరుణ్ తేజ్ కి జోడీగా మీనాక్షి చౌదరి, నోరా ఫతేహీ నటిస్తున్నారు. ఈ చిత్రం కోసం ఏకంగా నలుగురు ఫైట్ మాస్టర్స్ వర్క్ చేస్తున్నారని చిత్ర యూనిట్ కన్ఫర్మ్ చేసింది. మరి వరుణ్ తేజ్ కెరియర్ కి ఈ మూవీ ఎలాంటి సక్సెస్ ని ఇస్తుందనేది చూడాలి.