పిక్ టాక్ : ఆరంజ్ అందాల మీనూ ని చూశారా!
తాజాగా మీనాక్షి చౌదరి షేర్ చేసిన ఈ ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆరంజ్ కలర్ ఔట్ ఫిట్‌లో మీనాక్షి చౌదరి నడుము ఒంపులు చూపిస్తూ నాభి అందాలతో మతి పోగొడుతోంది.
2021లో 'ఇచట వాహనములు నిలుపరాదు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి. తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో టాప్ స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశాలను ఈ అమ్మడు సొంతం చేసుకుంది. మొదటి సినిమా కమర్షియల్‌గా నిరాశ పరచినా ఆ తర్వాత ఖిలాడి, హిట్ 2 సినిమాల్లోనూ ఆఫర్లు దక్కించుకోవడం ద్వారా టాలీవుడ్‌లో స్టార్‌డం దక్కించుకుంది. గత ఏడాది ఈ అమ్మడికి అత్యంత కీలకమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. 2024 ఆరంభంలో మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'గుంటూరు కారం' సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నటించిన విషయం తెల్సిందే.
గుంటూరు కారం సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచిన ఆ తర్వాత వచ్చిన సినిమాలతో మీనాక్షి చౌదరికి మంచి గుర్తింపు లభించింది. ముఖ్యంగా ఏడాది చివర్లో వచ్చిన 'లక్కీ భాస్కర్' సినిమా భారీ విజయాన్ని తెచ్చి పెట్టింది. ఆ తర్వాత వచ్చిన మట్కా, మెకానిక్ రాకీ సినిమాలు సైతం మీనాక్షి చౌదరిని ప్రేక్షకులకు మరింత చేరువ చేశాయి. గత ఏడాది చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే 2025 సంక్రాంతికి వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా మరో ఎత్తు. వెంకటేష్ తో కలిసి నటించిన మీనాక్షి చౌదరికి కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయం దక్కింది. రూ.300 కోట్ల వసూళ్లు సాధించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మీనాక్షి చౌదరి ఫుల్ బిజీ కాబోతుంది.
సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో మీనూ పాత్రలో పోలీస్ ఆఫీసర్‌గా కనిపించి మెప్పించింది. ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఫిజిక్ ఈ అమ్మడి సొంతం అంటూ విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. సోషల్ మీడియాలోనూ ఈ అమ్మడి క్రేజ్ విపరీతంగా పెరిగింది. తాజాగా మీనాక్షి చౌదరి షేర్ చేసిన ఈ ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆరంజ్ కలర్ ఔట్ ఫిట్‌లో మీనాక్షి చౌదరి నడుము ఒంపులు చూపిస్తూ నాభి అందాలతో మతి పోగొడుతోంది. ఈ రేంజ్ అందంగా ఉండటం వల్లే మిస్ ఇండియా గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018లో కిరీటాన్ని సొంతం చేసుకుంది.
సాధారణంగా ముద్దుగుమ్మలు అందాల కిరీటం దక్కించుకుంటే హీరోయిన్‌గా రాణించడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. మీనాక్షి చౌదరి ఆ అరుదైన జాబితాకి చెందుతుంది. ఫెమినా మిస్ ఇండియాలో నెగ్గిన తర్వాత సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి మెల్ల మెల్లగా నిలదొక్కుకుని వస్తుంది. ఈమధ్య కాలంలో ఈ అమ్మడు చేసిన సినిమాలు విజయాన్ని సొంతం చేసుకోవడంతో మరింత బిజీ కానుంది. ఈ ఏడాదిలో ఈమె ఖాతాలో స్టార్ హీరోల సినిమాలు పడే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న ఒక సినిమాలో నటిస్తోంది. తమిళ్‌లోనూ ఈ అమ్మడు ఒక సినిమాను చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఈ ఏడాదిలో మీనాక్షి చౌదరి నుంచి మూడు నాలుగు సినిమాలు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.