మీనాక్షి టైమ్.. ఇవి క్లిక్కయితే తిరుగుండదిక

మెస్మరైజ్ చేసే అందం, ఆకట్టుకునే యాక్టింగ్‌తో విశేషమైన గుర్తింపును తెచ్చుకున్న ఈ చిన్నది.. తెలుగు, తమిళంలో భారీ సినిమాలను చేస్తూ ముందుకు సాగుతోంది.

Update: 2024-10-26 14:30 GMT

ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో ఎంతో మంది కొత్త భామలు హీరోయిన్లుగా హల్చల్ చేస్తున్నారు. కానీ, అందులో చాలా తక్కువ మంది మాత్రమే వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటున్నారు. అలాంటి వారిలో మీనాక్షి చౌదరి ఒకరు. మెస్మరైజ్ చేసే అందం, ఆకట్టుకునే యాక్టింగ్‌తో విశేషమైన గుర్తింపును తెచ్చుకున్న ఈ చిన్నది.. తెలుగు, తమిళంలో భారీ సినిమాలను చేస్తూ ముందుకు సాగుతోంది.

టాలీవుడ్‌లోకి వచ్చిన తర్వాత హిట్: ది సెకెండ్ కేస్‌తో డీసెంట్ హిట్ దక్కించుకున్న మీనాక్షి చౌదరి.. ఆఫర్లను కూడా స్పీడుగానే సొంతం చేసుకుంటోంది. ఇలా ఇప్పటికే మహేశ్ బాబుతో 'గుంటూరు కారం' సినిమాలో నటించింది. అలాగే, తమిళంలో 'కోలై', 'సింగపూర్ సెలూన్', 'ది గోట్' మూవీలు చేసింది. అలా అక్కడ మంచిగానే కెరీర్‌ను నడుపుకుంటూ వెళ్తోంది.

తెలుగులో సరైన హిట్ కోసం ఎదురు చూస్తోన్న మీనాక్షి చౌదరి.. ఇప్పుడు దుల్కర్ సల్మాన్‌తో 'లక్కీ భాస్కర్' అనే సినిమాను చేసింది. ఈ చిత్రం అక్టోబర్ 31వ తేదీన ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇందులో మీనాక్షి చౌదరి రోల్ ఎంతో కీలకంగా ఉండబోతుందని ఇప్పటికే వచ్చిన ప్రచార చిత్రాల ద్వారా తెలిసింది.

మరోవైపు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌కు జోడీగా 'మట్కా' అనే మూవీని కూడా చేస్తోంది. నవంబర్ 14వ తేదీన ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. డిఫరెంట్ యాక్షన్‌తో రూపొందిన ఈ సినిమాను 'పలాస' ఫేం కరుణ కుమార్ తెరకెక్కించడంతో ఇది యమా హైలైట్ అవుతోంది. ఈ చిత్రంలో కూడా మీనాక్షి పాత్ర హైలైట్ కాబోతుందని అంటున్నారు.

వరుస చిత్రాలతో తనదైన హవాను చూపిస్తోన్న మీనాక్షి చౌదరి లైన్ లో 'మెకానిక్ రాకీ' అనే సినిమా కూడా ఉంది. ఈ మూవీ నవంబర్ 22వ తేదీన విడుదల కాబోతుంది. ఈ సినిమా కూడా మంచి హైప్‌ను క్రియేట్ చేసకుంటోంది. ఇటీవలే వచ్చిన ట్రైలర్‌కు భారీ రెస్పాన్స్ కూడా వచ్చిన విషయం తెలిసిందే. ఇలా మీనాక్షి నెల రోజుల వ్యవధిలోనే మూడు చిత్రాలతో సందడి చేయబోతుంది.

గతంలో చాలా మంది వేగంగా మూడు సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. కానీ, ఇప్పుడున్న భామల్లో మీనాక్షికి మాత్రమే టాలీవుడ్‌లో ఈ ఘనత దక్కిందని చెప్పుకుంటున్నారు. ఇవి మాత్రమే కాదు.. సంక్రాంతికి విడుదల కాబోతున్న వెంకటేష్ - అనిల్ రావిపూడి సినిమాలోనూ మీనాక్షి హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇవి హిట్ అయితే ఆమెకు టాలీవుడ్‌లో తిరుగే ఉండదని చెప్పుకోవచ్చు.

Tags:    

Similar News