ప్రైమ్ వీడియో అత్యుత్సాహం.. మెగా ఫ్యాన్స్ ఫైర్..!
రీసెంట్ గా సంక్రాంతికి రిలీజైన రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడే ఓటీటీ డీల్ జరిగింది.
స్టార్ సినిమా డిజిటల్ రిలీజ్ తర్వాత ఆ సినిమాను ప్రమోట్ చేసే బాధ్యతను ఆ ఓటీటీలు తీసుకుంటాయి. ఐతే సూపర్ హిట్టైన సినిమాకు వారు ఏం చేసినా దాని లెక్క వేరేలా ఉంటుంది కానీ అంచనాలను అందుకోని సినిమాకు వారు చూపించే అత్యుత్సాహం కొన్నిసార్లు ఆ హీరోల ఫ్యాన్స్ ని ఇబ్బంది పెడుతుంది. అంతేకాదు ఆ ఓటీటీ మీద రివర్స్ ఎటాక్ కి కారణం అవుతుంది. స్టార్ హీరోల తెలుగు సినిమాలన్నీ అయితే నెట్ ఫ్లిక్స్ లేదంటే అమెజాన్ ప్రైమ్ వీడియో లో రిలీజ్ అవుతున్నాయి.
సినిమా బడ్జెట్ ఇంకా స్టార్ కాంబినేషన్ ని బట్టి భారీ ధరకే సినిమా డిజిటల్ రైట్స్ తీసుకుంటున్నారు. ఇక సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా స్టార్ సినిమాల ఓటీటీ రిలీజ్ అప్పుడు ఓటీటీ సంస్థల ప్రమోషన్ కంపల్సరీ. ఈ క్రమంలో వారు చేసే కొన్ని జిమ్మిక్కులు ఫ్యాన్స్ కి మంట పెడుతుంటాయి. రీసెంట్ గా సంక్రాంతికి రిలీజైన రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడే ఓటీటీ డీల్ జరిగింది.
ఇక రీసెంట్ గా గేమ్ ఛేంజర్ ఓటీటీ రిలీజ్ కాగా ఈ సినిమా ను సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తూ ప్రైమ్ వీడియో వారు గేమ్ ఛేంజర్ లో ఒక క్లిప్ ని కామెడీ చేసేశారు. సినిమాలో రామ్ చరణ్ ఈ.సీ గా మారిన తర్వాత తన టీం లోకి అవినీతి పరులైన వారిని తీసేసి నిజాయితీ గల ఉద్యోగులను తీసుకుంటాడు. ఐతే ఆ టైం లో వాళ్లు అలా లేచిపోయి వేరే వాళ్లు ఇలా వస్తారు. దానికి ప్రైమ్ వీడియో ఊయ్ అనే సౌండ్ ఒకటి యాడ్ చేసి కామెడీ చేశారు.
ఐతే ఇది సినిమాలో చాలా సీరియస్ సీన్ కాగా దీన్ని జనాల ఆకర్షణకు ప్రైమ్ సోషల్ మీడియా వాళ్లు కామెడీ చేశారు. ఈ చీప్ పబ్లిసిటీ లేదా ప్రమోషన్ వల్ల ప్రైమ్ వీడియోపై మెగా ఫ్యాన్స్ అంతా ఫైర్ అవుతున్నారు. ప్రైం వీడియోలో గేమ్ ఛేంజర్ సినిమా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. సినిమాను చాలామంది థియేట్రికల్ వెర్షన్ స్కిప్ చేయగా అసలు సినిమాలో ఏముంది అని ప్రైమ్ వీడియోలో చూస్తున్నారు. ఐతే ఈ రెస్పాన్స్ కి ఏమాత్రం సంబంధం లేకుండా ప్రైమ్ వీడియో సోషల్ మీడియా వాళ్లు ఫ్యాన్స్ ని హర్ట్ చేస్తున్నారు. మరి ప్రైమ్ వీడియో వాళ్లు ఇలాంటి కామెడీలు ఆపకపోతే మాత్రం ఫ్యాన్స్ నుంచి నిజంగానే వ్యతిరేకత వస్తుందని చెప్పొచ్చు.