చిరంజీవి చేతికి గాయం ఎలా?

మెగాస్టార్ చిరంజీవి ఎడ‌వ చేతికి గాయం అయిన‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న చేతికి బ్యాండేజ్ తో క‌నిపించారు

Update: 2024-10-06 06:46 GMT

మెగాస్టార్ చిరంజీవి ఎడ‌వ చేతికి గాయం అయిన‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న చేతికి బ్యాండేజ్ తో క‌నిపించారు. కారు దిగుతోన్న స‌మ‌యంలో ఈ చేతి గాయం క‌నిపిస్తుంది. దీంతో అన్న‌య్య చేతికి ఏమైంది? అంటూ అభిమానులు సోష‌ల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. నిన్న‌టి రోజున రాజేంద్ర ప్ర‌సాద్ ఇంటికి ప‌రామ‌ర్శ‌కి వెళ్లిన స‌మ‌యంలో ఈ ఫోటో బ‌య‌ట ప‌డింది. ప్ర‌స్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

మ‌రి ఈ గాయం ఎలా అయింది? అన్న‌ది తెలియాల్సి ఉంది. ప్ర‌స్తుతం చిరంజీవి హీరోగా `విశ్వంభ‌ర` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తె లిసిందే. ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలో గాయమైందా? ఇంకేదైనా కార‌ణ‌మా అన్నది మెగా వ‌ర్గాలు ధృవీక‌రించాల్సి ఉంది. `విశ్వంభ‌ర` చిత్రం సోషియా ఫాంట‌సీ చిత్రంగా రూపొం దుతుంది. సినిమా కోసం చిరంజీవి డేఅండ్ నైట్ ప‌నిచేస్తున్నారు. కొన్ని రిస్కీ షాట్స్ కూడా చేస్తున్నారు.

ప్ర‌స్తుతం చిరంజీవి వ‌య‌సు 69 సంవ‌త్స‌రాలు. అయినా యాక్ష‌న్ స‌న్నివేశాల్లో త‌గ్గేదేలే? అంటూ ప‌నిచేస్తున్నారు. `సైరా న‌ర‌సింహారెడ్డి` సినిమా కోసం మెగాస్టార్ ఎంత‌గా శ్ర‌మించారు అన్న‌ది చెప్పాల్సిన ప‌న‌లేదు. ఆ వ‌య‌సులోనూ వార్ స‌న్నివేశాల్లో త‌న‌దైన మార్క్ వేసారు. గుర్ర‌పు స్వారీ, క‌త్తి యుద్దం స‌న్నివేశాల్లో క‌నిపించి ప్రేక్ష‌కుల్ని అల‌రించారు. ఆ త‌ర్వాత చిత్రాల్లోనూ యాక్ష‌న్ ఎపిసోడ్లు ఎన్నో చేసారు.

కానీ ఏస‌మ‌యంలోనూ గాయాల పాలు కాలేదు. తాజాగా గాయంతో క‌నిపించ‌డంతో `విశ్వంభ‌ర` షూట్ లోనే ఏదో జ‌రిగి ఉంటుంద‌ని అభిమానులు భావిస్తున్నారు. కానీ చిత్ర యూనిట్ నుంచి మాత్రం ఇలాంటి సంఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు.

Tags:    

Similar News