ఓటీటీలోకి వ‌స్తున్నా! అన్న‌య్య ఊపు తేవ‌డం లేదు?

ప్రేక్ష‌కులంతా ఓటీటీకి అల‌వాటు ప‌డ్డారు. థియేట‌ర్లో చూడ‌లేక‌పోయిన సినిమా ఎంచ‌క్కా ఓటీటీలో ఆస్వాదిస్తున్నారు.

Update: 2023-09-10 11:10 GMT

ప్రేక్ష‌కులంతా ఓటీటీకి అల‌వాటు ప‌డ్డారు. థియేట‌ర్లో చూడ‌లేక‌పోయిన సినిమా ఎంచ‌క్కా ఓటీటీలో ఆస్వాదిస్తున్నారు. అది హిట్ సినిమా అయినా..ప్లాప్ సినిమా అయినా ఒక‌సారి చూస్తే పోలే! అన్న ధోర‌ణిలో ఖాళీ స‌మ‌యంలో వీక్షిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో స్టార్ హీరోల సినిమాల‌కు స‌హ‌జంగానే థియేట‌ర్లో ఫెయిలైనా ఓటీటీలో సోసోగా అయినా న‌డిచే అవ‌కాశం ఉంది. అలా ఓటీటీలో మంచి రేటింగ్ సాధించిన సినిమాలెన్నో ఉన్నాయి.

ఓటీటీ రాక‌ముందు ఈ త‌ర‌హా రేటింగ్ లు టీవీల్లో వ‌చ్చే సినిమాల‌కు ద‌క్కేవి. థియేట‌ర్లో పోయిన సినిమాలెన్నో బుల్లి తెర‌పై మంచి విజ‌యం సాధించ‌న‌వి ఎన్నో. మ‌రి ఈనెల 15న ఓటీటీలోకి వ‌స్తోన్న `భోళా శంక‌ర్` ఆ రేంజ్ స‌క్సెస్ అందుకుంటుందా? అంటే చెప్ప‌డం చాలా క‌ష్ట‌మైన ప‌నే. మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈసినిమా థియేట‌ర్లో ఎలాంటి విజ‌యం సాధించిందో తెలిసిందే.

భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన సినిమా మ‌రుస‌టి రోజే థియేట‌ర్ల నుంచి తీసేసే ప‌రిస్థితి వ‌చ్చింది. అంత గొప్ప సినిమా ఆ ద్వ‌యంలో తెర‌కెక్కింది. మరి ఇప్పుడు ఓటీటీలో కి వ‌స్తుందా? కొద్దో గోప్పో ఏదైనా బ‌జ్ ఉందా? అంటే జీరో అనే చెప్పాలి. ఈ సినిమా ఓటీటీలోకి వ‌స్తుంద‌న‌మే మాట త‌ప్ప‌! అట్ట‌ర్ ప్లాప్ సినిమాని ఎవ‌రూ చూస్తారు లే అన్న విమ‌ర్శ‌లే వినిపిస్తున్నాయి. నిజానికి చిరంజీవి ఏసినిమా విష‌యంలో ఇంత ప్ర‌భావం చూప‌లేదు.

గ‌తంలో రిలీజ్ అయిన `ఆచార్య` కూడా ప్లాప్ సినిమానే. కానీ ఓటీటీలో నెమ్మ‌దిగా నెట్టుకొచ్చింది. కానీ `భోళాశంక‌ర్` ఆ మాత్రం కూడా మ్యానేజ్ చేయ‌లేకపోతుంది. మరి ఇంత నెగిటివిటీ కార‌ణం ఏంటి? అంటే చిరంజీవి ఎంపిక చేసుకున్న కంటెంట్ స‌హా రిలీజ్ త‌ర్వాత సోష‌ల్ మీడియాలో ఆయ‌న‌పై జ‌రిగిన ట్రోలింగ్..సినిమాపై వ‌చ్చిన తీవ్ర‌మైన నెగిటివిటీ ప్ర‌ధానంగా క‌నిపిస్తోంది. క‌నీసం ఓటీటీలో కూడా చూడ‌టానికి అనాసక్తి చూపిస్తున్నారంటే? సినిమాపై ఎంత నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వ‌చ్చిందో అర్ధం చేసుకోవ‌చ్చు.

Tags:    

Similar News